Movie News

పుష్ప-2.. గుమ్మడికాయకు ముహూర్తం

ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 12 రోజుల సమయమే మిగిలి ఉంది. ఇంత పెద్ద సినిమాకు చాలా ముందే షూట్ పూర్తి చేసి.. ఈపాటికి జోరుగా ప్రమోషన్లు చేస్తూ ఉండాలి. కానీ సుకుమార్ సినిమా అంటే చివరి వరకు హడావుడి తప్పదు. ఆయన మొదట నెమ్మదిగా షూటింగ్ చేస్తారు. ఆఖర్లో హడావుడి పడతారు. బెస్ట్ ఔట్ పుట్ కోసం తపనలో భాగమే ఇదంతా. ఒక దశలో షూటింగ్ మరీ ఆలస్యం అవుతుండడంతో డిసెంబరు 5కైనా ఈ చిత్రం రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు కలిగిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత సుకుమార్ అండ్ టీం రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ సినిమాను గాడిన పెట్టారు.

ఐతే చివర్లో హడావుడి మాత్రం తప్పలేదు. నెలాఖరు వరకు షూటింగ్ కొనసాగుతుందనే వార్తలు వచ్చాయి. కానీ గత రెండు మూడు వారాల కష్టం వల్ల ‘పుష్ప-2’ షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసింది. విశ్వసనీయ సమాచారం ‘పుష్ప-2’కు ఆదివారం ఉదయం లేదా మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు.

అల్లు అర్జున్-శ్రీలీల మీద ఐటెం సాంగ్ పూర్తి చేశాక.. పుష్ప-3 లీడ్ సీన్‌తో పాటు ప్యాచ్ వర్క్ కూడా అవగొట్టేసిన టీం గత మూడు రోజులుగా బన్నీ-రష్మిక మీద చివరి పాటను చిత్రీకరిస్తోంది. అన్నపూర్ణ స్టూడియో, సారథీ స్టూడియోల్లో ఈ పాట షూట్ జరుగుతోంది. శనివారం ఫుల్ నైట్ ఈ పాట చిత్రీకరణ కొనసాగబోతోంది. ఉదయం లేదా మధ్యాహ్నానికి ఆ పాట అయిపోతుందని.. అది పూర్తవగానే గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం.

ఓవైపు షూట్ చేస్తూనే.. మరోవైపు సమాంతరంగా ఎడిటింగ్, డబ్బింగ్, మిక్సింగ్ పనులనూ సమాంతరంగా చేస్తోంది పుష్ప-2 టీం. ఒక దశలో 22కే సెన్సార్ చేయించేయాలని అనుకున్నారు కానీ.. కుదరలేదు. రెండు మూడు రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేసి సినిమాను సెన్సార్‌కు పంపించేయాలని చూస్తున్నారు. పుష్ప-1 తరహాలో కాకుండా వారం ముందే విదేశాలకు కేడీఎంలు డెలివర్ చేసేయాలని చూస్తున్నారు. చివరి వారం రోజులు సినిమాను దేశవ్యాప్తంగా గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు.

This post was last modified on November 23, 2024 2:04 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

49 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago