Movie News

రానా ట్రోల్స్ గురించి నాని సలహా

ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల మీద వేసిన సెటైర్ల మీద చిన్నపాటి దుమారమే రేగింది. మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. దీనికి రానా స్పందిస్తూ ఇకపై జోకులు వేసేటప్పుడు ఇది హాస్యం కోసమని సబ్ టైటిల్స్ వేసే పరిస్థితి వస్తోందని చెప్పగా తేజ సజ్జ చిన్నప్పటి నుంచి కలిసి నటించి చూసిన హీరోల మీద పంచులు ఎందుకు వేస్తానని, అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోయింది తప్ప కావాలని చేసింది కాదని వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఈ టాపిక్ వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన దగ్గుబాటి రానా షోలో న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంకా మోహన్, తేజ సజ్జలు మొదటి ఎపిసోడ్ గెస్టులుగా వచ్చారు. ఇందులో సోషల్ మీడియా ట్రోల్స్, ప్రత్యేకంగా ఐఫా ఘటన గురించి ప్రస్తావన వచ్చింది. దానికి నాని స్పందిస్తూ హ్యూమర్, సీరియస్ నెస్ కి తేడా తెలియకుండా పోతోందని, ఇకపై ఇలాంటివి మరిన్ని చేస్తే జనాలు అలవాటు పడి ఎంజాయ్ చేయడం మొదలుపెడతారని అన్నాడు. ఇందులో లాజిక్ ఉంది. సెటైరిక్ కామెడీని ఆస్వాదించాలంటే దానికి ముందు సంసిద్ధంగా ఉండాలి. కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఈ ట్రెండ్ అలవాటు లేదు.

ఇక్కడే కాదు తమిళంలోనూ రానాకి ఇదే అనుభవమయ్యింది . గతంలో కోలీవుడ్ హీరో ఆర్యతో కలిసి యాంకరింగ్ చేసినప్పుడు అక్కడి స్టార్ల మీద ఇద్దరు కొన్ని జోకులు వేశారు. దాని దెబ్బకు వాళ్లంతా మూడు నాలుగు సంవత్సరాలు రానాతో మాట్లాడ్డం మానేశారు. అప్పుడు కానీ రానాకు అర్థం కాలేదు తన కామెంట్స్ ని ఎంతగా అపార్థం చేసుకున్నారో. హిందీలో ఒకరి మీద మరొకరు పంచులు వేసుకోవడం సహజం. ఇక్కడ అలవాటు లేకపోవడం వల్లే రానా, తేజల మీద ఆన్ లైన్ విసుర్లు వచ్చాయి కానీ నాని అన్నట్టు ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసుకుని ఆడియన్స్ కి అలవాటు చేయడం ఇప్పటి ట్రెండ్ లో చాలా అవసరం.

This post was last modified on November 23, 2024 4:26 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago