తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన ఘనవిజయం ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి ప్రేరేపించిన మాటా వాస్తవమే. బాలకృష్ణ ఎంతో శ్రమ కోర్చి ఖర్చు పెట్టి రెండు భాగాలుగా తీసినా ఆదరణ దక్కించుకోకపోవడానికి కారణాలు ఎన్నో. ప్రేక్షకుడిని కదిలించే హెచ్చుతగ్గులు, తగినంత డ్రామా లేకపోవడం వల్లే ఫ్లాప్ అయ్యిందనేది బహిరంగ రహస్యం. ఆ తర్వాత ఇంకెవరు టాప్ స్టార్స్ మీద బయోపిక్కులు తీసే సాహసం చేయలేదు. తాజాగా నాగార్జున దగ్గర ఏఎన్ఆర్ బయోపిక్ ప్రస్తావన వచ్చింది.
గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున నాన్నగారి బయోపిక్ బోరింగ్ గా ఉండే అవకాశాలున్నాయని, కెరీర్ ప్రారంభంలో ఎత్తుపల్లాలు చూసినా తర్వాత ఎక్కడమే కానీ దిగడం తెలియనంత గొప్పగా ప్రస్థానం జరిగిందని, సినిమా స్థానంలో డాక్యుమెంటరీ అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. కల్పిత విషయాలు జోడిస్తే తప్ప బయోపిక్స్ వర్కౌట్ కావని తనకా ఉద్దేశం లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఏదో మాట వరసకు తీస్తానని చెప్పకుండా ఇంత ఓపెన్ గా నిజాన్ని ఒప్పేసుకోవడం నాగార్జున ప్రాక్టికల్ కోణంలో ఒక భాగమే.
ఈ లెక్కన కృష్ణ, ఎస్విఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి ఆనాటి మేటి నటుల జీవితాలు తెరకెక్కడం అనుమానమే. ఇప్పటి ఆడియన్స్ లోనూ వీటి మీద ఆసక్తి తగ్గిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం మీద బోలెడు పుస్తకాలు వచ్చాయి. ఆయనే స్వయంగా అనుభవాలు పంచుకున్న వీడియోలు ఉన్నాయి. అవన్నీ క్రోడీకరించి నాగ్ చెప్పినట్టు ఒక డాక్యుమెంటరీగా మారిస్తే భవిష్యత్ తరాలకు ఒక రిఫరెన్స్ గా ఉండిపోతుంది. పాత క్లాసిక్స్ ని భద్రపరిచే విషయంలోనూ అన్నపూర్ణ స్టూడియోస్ చేస్తున్న కృషిని నాగార్జున వివరించారు. సో ఏఎన్ఆర్ బయోపిక్ తెరమీద చూసే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on November 23, 2024 11:47 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…