ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్ లో చూశాక సెకండాఫ్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవమే. ఆ మాటకొస్తే థియేటర్ రిలీజ్ సమయంలోనూ ఈ కామెంట్స్ వినిపించాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, ఇంటెన్స్ గా నడిచే తొలి సగం జనాలతో పైసా వసూల్ అనిపించాయి. దాంతో వర ఎపిసోడ్ నుంచి గ్రాఫ్ డౌన్ అయిపోయినా చివరికి క్లైమాక్స్ ఘట్టంతో సంతృప్తి పడేలా చేశారు. అయినా సరే దర్శకుడు కొరటాల శివ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని అధిక శాతం పబ్లిక్ నుంచి వినిపించిన టాక్.
దీంతో దేవర 2 ఉండబోవడం లేదని కొరటాల శివ వేరే ప్రాజెక్టు చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే తారక్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి దేవర 2కి పక్కన పెట్టేయాలన్న ఆలోచన ఏదీ లేదట. కాకపోతే కెజిఎఫ్, బాహుబలి లాగా వెంటనే తీయాలనే ప్రణాళిక పెట్టుకోలేదు కాబట్టే తారక్ వార్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఒప్పుకున్నది ఇప్పుడు కాదు. దేవర షూటింగ్ లో ఉండగానే లాకయ్యింది. కాకపోతే అనౌన్స్ మెంట్ లేటయ్యింది. ఇవి కాకుండా మరో బాలీవుడ్ మూవీ సంతకం చేశాడనే ప్రచారం గురించి కూడా ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదు.
సో ఫ్యాన్స్ టెన్షన్ పడేందుకు ఏమి లేదు. కొరటాల శివ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. దేవర 2కి కావాల్సిన మార్పులు చేర్పుల మీద త్వరలోనే పని ప్రారంభిస్తారట. కాకపోతే ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. పుష్ప 2 రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎంత గ్యాప్ ఉందనేది పట్టించుకోకుండా కంటెంట్ బాగా రావాలనే ఉద్దేశంతో ఆలస్యమైనా పర్వాలేదని స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని తెలిసింది. జాన్వీ కపూర్, శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, మురళీశర్మ తదితరులందరూ సీక్వెల్ లోనూ కొనసాగబోతున్నారు. సెకండ్ పార్ట్ విలన్ గా బాబీ డియోల్ అదనంగా తోడయ్యే టాక్ కూడా దాదాపు నిజమే.
This post was last modified on November 22, 2024 4:05 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…