కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన నయనతార, ధనుశ్ వివాదం గురువారం జరిగిన వివాహ వేడుకలో మరోసారి వెలుగులోకి వచ్చింది. చెన్నైలో జరిగిన టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహానికి ఇద్దరూ హాజరయ్యారు. మొదట ధనుశ్ వేడుకలోకి రాగా, అనంతరం నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలసి వచ్చారు. ఇద్దరూ ఒకే వరుసలో కూర్చోడం విశేషం.
వివాహ వేదికలో ముందుకు కేటాయించిన కుర్చీల్లో ధనుశ్, నయనతార ఒకే వరుసలో ఉన్నప్పటికీ, ఒకరి వైపు మరొకరు చూడకుండా, పూర్తిగా ఉత్సవానికి తగినట్టుగా ఉండటమే గమనార్హం. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వెళ్ళినప్పుడు కూడా, ఇద్దరూ తగిన దూరాన్ని పాటిస్తూ ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు.
ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలను నయనతార భద్రతా బృందం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇద్దరికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వేడుకకు సంబంధించి లీకైన ఫోటోలో నయనతార పింక్ కలర్ చీరలో, ధనుశ్ సంప్రదాయ పంచె కట్టులో మెరిసిపోయారు. ఇద్దరూ కుర్చీలపై తమదైన శైలిలో కూర్చొని వేడుకను ఆస్వాదించారు.
ఇద్దరి మధ్య వివాదానికి కారణం నయనతార తీసిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ నుంచి వచ్చిందే. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఈ డాక్యుమెంటరీలో ‘నేనూ రౌడీనే’ సినిమాలోని 3 సెకన్ల క్లిప్పింగ్‌ను వాడటంపై ధనుశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా నిర్మాతగా ఉన్న ధనుశ్, తన అనుమతి లేకుండా క్లిప్పింగ్‌ను వాడారని మండిపడుతూ రూ.10 కోట్లు పరిహారం డిమాండ్ చేశారు. ఇక తాము రెండేళ్లపాటు ధనుశ్ నుండి అనుమతి కోసం ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదని నయనతార ఆరోపించారు.
This post was last modified on November 22, 2024 11:45 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…