గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో ‘ఆర్‌సీ 16’ షూటింగ్ నేడు కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం శ్రీ చాముండేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించిన బుచ్చిబాబు.. అమ్మవారి ఆశీస్సులతో రెగ్యులర్ షూటింగ్ ను షురూ చేశాడు. ఈ మేరకు ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు.
ఇట్స్ ఎ బిగ్ డే అంటూ చేతిలో స్క్రిప్ట్ పేపర్లు పట్టుకుని ఆలయ ప్రాంగణం ముందు దిగిన ఫోటోను బుచ్చిబాబు పంచుకున్నాడు. మైసూర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో దాదాపు వారం రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని అంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ లపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. హీరో,హీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం కూడా షూట్ లో జాయిన్ అవుతున్నారు.
తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన బుచ్చిబాబు.. దాదాపు రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో స్ప్రోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఆర్‌సీ 16 మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అలరించబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on November 22, 2024 11:16 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…