టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో ఉన్నాయి. దేంట్లోనూ వందల కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసే స్టార్ హీరోలు లేరు. దర్శకులకు హిట్ ట్రాక్ రికార్డు లేదు. పైగా అనుభవం తక్కువే. అయినా సరే కంటెంట్ నమ్ముకుని బరిలో దిగుతున్నాయి. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మీద మంచి బజ్ నెలకొంది. ప్రీమియర్ల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ గురించి పాజిటివ్ గా ఉన్నాయి. దర్శకుడు రవితేజ చూపించిన ట్విస్టులు కనక కనెక్ట్ అయితే ఫలితం దక్కేలా ఉంది. స్పష్టత రావాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే.
మీనాక్షి చౌదరి – శ్రద్ధ శ్రీనాథ్ గ్లామర్ లకు తోడు జేక్స్ బెజోయ్ సంగీతం దన్నుగా నిలిచింది. సత్యదేవ్, డాలీ ధనుంజయ్ నటించిన చోటా మల్టీ స్టారర్ జీబ్రా మీద భారీ హైప్ లేకపోయినా టీమ్ వినూత్నంగా చేసిన ప్రమోషన్లు మూవీ లవర్స్ దృష్టిలో పడ్డాయి. సో టాక్ కీలక పాత్ర పోషించాలి. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ పనితనం ట్రైలర్ లో కనిపించింది. ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే సత్యదేవ్ కు హిట్ పడ్డట్టే. అశోక్ గల్లా రెండో చిత్రం దేవకీనందన వాసుదేవ కథను ప్రశాంత్ వర్మ ఇచ్చాడనే దాని మీద ఎక్కువ మార్కెటింగ్ చేశారు. మేనల్లుడి కోసం మహేష్ బాబు ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి బజ్ తీసుకొచ్చాయి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ వాసుదేవలో ఫాంటసీ టచ్ ఉండటం వల్ల ఫ్యామిలీ జనాలను ఆకట్టుకోవడం ముఖ్యం. దర్శకుడు అర్జున్ జంధ్యాల గతంలో తీసింది ఒక్క సినిమానే అయినా తానేంటో దీంతో ఋజువు చేస్తానని అంటున్నాడు. రోటి కపడా రొమాన్స్ యూత్ ని టార్గెట్ చేస్తోంది. ప్రీమియర్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. మొత్తంగా బాక్సాఫీస్ నాలుగు ముక్కలాటలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇవి కాకుండా కేసీఆర్ కేశవ చంద్ర రమావత్, మందిర, కనకమహాలక్ష్మిలతో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు రేసులో ఉన్నాయి. చూడాలి మరి ఏవి నిలుస్తాయో ఏవి గెలుస్తాయో.
This post was last modified on November 22, 2024 10:33 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…