సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా.. డిస్ట్రిబ్యూషన్ ద్వారా అయినా ఆయన రేసులో ఉంటారు. ప్రొడక్షన్లో ఓ సినిమా, డిస్ట్రిబ్యూషన్లో ఓ సినిమాతో ఆయన బరిలో నిలిచిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈసారి సంక్రాంతికి రిలీజ్ కానున్న మూడు పెద్ద చిత్రాల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉండడం విశేషం.
రాజు నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10నే విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చిన నాలుగు రోజులకు విడుదల కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా రాజు సినిమానే అన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్‌గా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారైంది. 2022లో మైత్రీ వాళ్లు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను బరిలో నిలిపినట్లే.. ఈసారి రాజు తన ప్రొడక్షన్లో తెరకెక్కిన రెండు చిత్రాలను రేసులో నిలబెట్టారు. విశేషం ఏంటంటే.. పండక్కి రిలీజ్ కాబోతున్న మరో పెద్ద సినిమాలోనూ రాజు భాగస్వామ్యం ఉంది.
నందమూరి బాలకృష్ణ సినిమా ‘డాకు మహారాజ్’ను నైజాం, వైజాగ్ ఏరియాల్లో రాజు రిలీజ్ చేయబోతున్నాడు. హారిక హాసిని- సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌లు నిర్మించే సినిమాలను చాలా వరకు రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. వీరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది.
‘డాకు మహారాజ్’ హక్కులను కూడా నైజాం, వైజాగ్ ఏరియాలకు ఆయనే సొంతం చేసుకున్నారు. దీంతో సంక్రాంతికి రానున్న మూడు పెద్ద సినిమాలతో రాజు పెద్ద బెట్టే వేయబోతున్నాడన్నమాట. సందీప్ కిషన్ సినిమా ‘మజాకా’ కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు. మరి ఆ సినిమా మీద కూడా రాజు హ్యాండ్ పడుతుందేమో చూడాలి.
This post was last modified on November 22, 2024 8:11 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…