బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12 రిలీజ్ డేట్ ప్రకటించేశారు కాబట్టి దానికి అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. ఇటీవలే వచ్చిన టీజర్ అంచనాలు అమాంతం పెంచేయగా సితార సంస్థ బిజినెస్ డీల్స్ మొదలుపెట్టిందని సమాచారం. ఏరియాల వారిగా థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక మొత్తానికి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఎంత మొత్తమనేది ఇంకొద్దిరోజుల్లో బయటికి వస్తుంది కానీ డాకు మహారాజ్ అసలు ఎలాంటి కథతో వస్తుందనేది ఫ్యాన్స్ లో రేగిన ప్రశ్న.
కీలకమైన లీక్స్ ని బట్టి చూస్తే ఇందులో దర్శకుడు బాబీ బలమైన రివెంజ్ డ్రామా రాసుకున్నట్టు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో చాందిని చౌదరికి సంబంధించిన ఎపిసోడ్ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు బాలయ్య గెటప్, మ్యానరిజం తదితరాలు కొత్తగా ఉంటాయని అంటున్నారు. పోలీస్ ఆఫీసరనే ప్రచారం కూడా ఉంది. అయితే ఒక ప్రభుత్వాధికారి విచక్షణ లేకుండా విలన్ల దండు మీద పడిపోయే డాకూ మహారాజ్ గా ఎందుకు మారాడనేది మెయిన్ పాయింటట. వాల్తేరు వీరయ్యలో రవితేజ ట్రాక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన బాబీ ఇందులో అంతకు మించి పవర్ ఫుల్ బ్లాక్స్ పెట్టారట.
నిర్మాత నాగవంశీ చెబుతున్న అయిదు హై యాక్షన్ బ్లాక్స్ లో రెండు పైన చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో వస్తాయని వినికిడి. హారర్ తరహా సౌండింగ్ వచ్చేలా డాకు పేరు ఎందుకు పెట్టారనే జస్టిఫికేషన్ అభిమానులకే కాదు మాస్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా సాగుతుందట. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలాలు హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ మెయిన్ విలన్. ఊహించని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయట. సంక్రాంతి బరిలో రామ్ చరణ్, వెంకటేష్ తో పోటీ పడబోతున్న బాలయ్య మరోసారి పండగ సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on November 22, 2024 8:22 am
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…