దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే KL నారాయణ నిర్మాణంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా నిర్మాణంలో మరో మాస్టర్ మైండ్ కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. నిర్మాణంలో అనుభవజ్ఞుడైన శోభు యార్లగడ్డను కూడా టీమ్ లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
జక్కన్న ఆయనకు కార్యనిర్వాహక నిర్మాతగా ( executive producer) హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో నిర్మాతగానే కాకుండా శోభు మార్కెటింగ్ లో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్కెటింగ్ చేయడం, సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయన అనుభవం రాజమౌళికి హెల్ప్ అయ్యింది.
RRR ఆస్కార్ గెలవడం ఒక ఎత్తైతే. దాని వెనకాల నామినేషన్ కోసం జరిగిన ప్రాసెస్‌లో శోభు పాత్ర చాలానే ఉంది. శోభు యార్లగడ్డ తెలివితేటలతో సినిమా ప్రొడక్షన్, మార్కెటింగ్‌లో మంచి పట్టు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రోత్సహించడం, అక్కడి ప్రేక్షకుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడం, అలాగే అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించడం వంటి విషయాల్లో ఆయన ముందుంటారు.
ఇక బిజినెస్ యాంగిల్స్ లో కూడా ఆయన మాస్టర్ మైండ్. ప్రమోషన్ ఖర్చు విషయంలో ఆయన విజన్ బెస్ట్ అని జక్కన్న చాలాసార్లు చెప్పారు. ఇక మహేష్ సినిమా కేవలం పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకుండా పాన్ వరల్డ్ లెవెల్‌లో రూపొందుతుండటంతో, అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ప్రమోట్ చేయడం చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలో రాజమౌళి నమ్మకంతో శోభును తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా నిర్మాణానికి శోభు మైండ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.