జబర్దస్త్ కామెడీ షోతో పాపులరైన చాలా మంది తర్వాత సినిమాల్లో కమెడియన్లుగా అవకాశాలు అందుకున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను లాంటి వాళ్లు హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ కోవలో మరో జబర్దస్త్ కమెడియన్ హీరోగా హీరోగా మారాడు. అతనే.. రాకింగ్ రాకేష్. అతను లీడ్ రోల్ చేయడమే కాదు, స్వయంగా నిర్మించిన సినిమా.. కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికే కాదు.. ప్రమోట్ చేయడానికి కూడా రాకేష్ చాలానే కష్టపడుతున్నాడు. ప్రమోషన్లకు డబ్బులు లేకో ఏంటో తన సినిమా పోస్టర్లను తనే అంటించుకుంటూ మీడియా దృష్టిలో పడ్డాడు రాకేష్. హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి తన సినిమా పోస్టర్లను హీరోనే అంటిస్తుండడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోలు, వీడియోలు చూసి సోషల్ మీడియాలో రాకేష్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకమైన ప్రమోషన్ కూడా కావచ్చు అంటున్నారు. కేసీఆర్ సినిమా తీయడానికి తన ఇంటిని తాకట్టు పెట్టినట్లు ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు రాకేష్. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా ఎంత కష్టపడిందీ చెబుతూ అతను ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ భార్య జోర్దార్ సుజాత కూడా ఈ సినిమా ప్రమోషన్లో తన వంతు పాత్ర పోషిస్తోంది.
తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు, ఏపీ మాజీ మంత్రి రోజా, హైపర్ ఆది తదితరులు పాల్గొన్న కేసీఆర్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాకేష్, సుజాతలే యాంకర్లుగా వ్యవహరించారు. కేసీఆర్ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. సినిమాను పూర్తి చేయడంలో ఇబ్బందులు, థియేటర్ల సమస్య వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయింది. గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాకేష్ సరసన అనన్య కృష్ణన్ కథానాయికగా నటించింది.
This post was last modified on November 21, 2024 12:07 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…