మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ ఏస్ డైరెక్టర్ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. గేమ్ చేంజర్. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యం అయింది కానీ.. ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఇండియాలోనే బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లతో పని చేసిన తమన్.. తనను ‘బాయ్స్’ సినిమాతో నటుడిగా పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పని చేయాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్నాడు.
తన కెరీర్లో ఎప్పుడూ ఏఆర్ రెహమాన్, లేదంటే హారిస్ జైరాజ్‌తో మాత్రమే పని చేసిన శంకర్.. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్లను మారుస్తున్నాడు. ‘ఇండియన్-2’కు అనిరుధ్‌తో పని చేయించుకున్న ఆయన.. ‘గేమ్ చేంజర్’కు తమన్‌ను ఎంచుకున్నాడు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి రెండు పాటలు రాగా.. వాటికి ఓ మోస్తరు స్పందనే వచ్చింది.
జరగండి, రా మచ్చా రా పాటలు సూపర్ అని చెప్పలేం. అలా అని తీసిపడేయలేం. ఐతే తమన్ నుంచి ఇంకా బెస్ట్ అనిపించే పాటను చరణ్ అభిమానులు ఆశిస్తున్నారు. తర్వాతి పాట అలాంటిదే అవుతుందని తమన్ టీం ధీమాగా ఉంది. ఈ సినిమా నుంచి మూడో పాట మెలోడీ అట. అది చాలా జ్ఞాపకాలను మిగులుస్తుందని.. ఈ పాట కోసం సిద్ధంగా ఉండాలని తమన్ పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజుల్లోనే ఈ పాటను లాంచ్ చేయబోతున్నారు. మరి అభిమానులు ఆశించే బ్లాస్ట్ సాంగ్ ఇది అవుతుందా అన్నది చూడాలి.
‘గేమ్ చేంజర్’ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. కొన్ని రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబరులో చాలా వరకు ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈవెంట్లు చేయబోతున్నారు. జనవరి 10న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.
This post was last modified on November 20, 2024 5:16 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…