ఈ తప్పు ఎలా దిద్దుకుంటారు బిగ్‍బాస్‍?

బిగ్‍బాస్‍ హౌస్‍లోకి వెళ్లిన తర్వాత సెలబ్రిటీ అయినా, ఇంకా బ్రేక్‍ రాని టాలెంట్‍ అయినా ఒకటే. ప్రేక్షకులను మెప్పించడానికి అందరికీ సమ అవకాశమివ్వాలి. ఏ ఒక్కరికీ ఆడియన్స్ దృష్టిలో ప్రత్యేకమయిన రాయితీలు వుండకూడదు. కానీ గంగవ్వను ఈ సీజన్లో కంటెస్టెంట్‍గా పంపించడం ద్వారా బిగ్‍బాస్‍ యాజమాన్యం మిస్టేక్‍ చేసినట్టు అనిపిస్తోంది.

ముఖ్యంగా వర్త్ కంటెస్టెంట్లకు ఆమె వుండడం వల్ల కాస్తయినా అన్యాయం జరుగుతోంది. గంగవ్వను నామినేట్‍ చేసినా, లేదా ప్రతి విషయంలోను ఆమెను హైలైట్‍ చేయకపోయినా ఆడియన్స్ దృష్టిలో ఎక్కడ బ్యాడ్‍ అవుతామో అనే ధోరణి మిగతా హౌస్‍మేట్స్ కనబరుస్తున్నారు. అక్కడ ఏది జరిగినా కానీ గంగవ్వ విన్నర్‍ అంటూ ఆమెకు కిరీటం తొడిగేస్తున్నారు.

దీనిని వ్యతిరేకించే వాళ్లు కొందరున్నా కానీ హౌస్‍లో మెజారిటీ సింపతీ గేమ్‍ ఆడుతోంటే తామెక్కడ బ్యాడ్‍గా కనిపిస్తామోనని మిగతావాళ్లూ అదే కొనసాగిస్తున్నారు. ఒకవేళ గంగవ్వను నామినేట్‍ చేసినా కానీ ప్రేక్షకులలో ఆమె పట్ల వున్న సింపతీ ఫ్యాక్టర్‍ వల్ల ఓట్లు వచ్చేస్తున్నాయి.

ఫిజికల్‍ టాస్కులలో అసలు పాల్గొనలేనంటూ పక్కకు కూర్చుండిపోతున్న గంగవ్వను కొనసాగించి టైటిల్‍ గెలిచే హక్కున్న ఎంతమంది కంటెస్టెంట్లను బయటకు పంపిస్తారు? ఇంకా బిగ్‍బాస్‍ టీమ్‍ ఎన్నాళ్లు ఈ అన్‍ఫెయిర్‍ గేమ్‍ ఆడతారు? విశేషం ఏమిటంటే ఈవారం కూడా హౌస్‍మేట్స్ గంగవ్వను నామినేట్‍ చేయలేదు. మొదటి రెండు వారాలు మాత్రమే నామినేట్‍ అయిన గంగవ్వ వరుసగా మూడోసారి నామినేషన్లు తప్పించుకున్నట్టయింది.