రామ్ చరణ్ ఇంతవరకు టాప్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, కొరటాల శివతో ఒక్క సినిమా కూడా చేయలేదు. త్రివిక్రమ్‍తో అతని సినిమా పలుమార్లు ఖాయమయినట్టే అయి కాన్సిల్ అయింది. కొరటాల శివ చిత్రానికి కూడా అలానే పలు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటిలో త్రివిక్రమ్‍తో సినిమా త్వరలో పక్కాగా వుంటుందని ఆమధ్య టాక్ వచ్చింది.
తారక్‍తో త్రివిక్రమ్ చేసే చిత్రం పూర్తయిన తర్వాత చరణ్‍తోనే సినిమా వుంటుందని, అది పవన్‍కళ్యాణ్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతుందని ప్రచారం జరిగింది. త్రివిక్రమ్‍తో సినిమా మొదలయ్యే నాటికి మరో ప్రాజెక్ట్ తో లాక్ అయిపోకుండా చరణ్ ఇంతవరకు మరో చిత్రమేదీ ఖాయం చేసుకోలేదు. అయితే చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‍కి ఈసారి మహేష్ అడ్డు పడేలా వున్నాడనేది లేటెస్ట్ గాసిప్.
ఎన్టీఆర్‍తో సినిమా లేటయితే కనుక మహేష్‍తో ఈలోగా ఒక సినిమా చేసేయడానికి త్రివిక్రమ్ ప్రయత్నించాడు. కానీ ఎన్టీఆర్ అందుకు అంగీకరించలేదని, ఆర్.ఆర్.ఆర్. షూట్ ముగించుకుని త్వరలోనే ఈ సినిమా మొదలు పెడతానని చెప్పాడని, అంచేత మహేష్ సినిమా దీని తర్వాతే వుంటుందని అంటున్నారు. అదే జరిగితే మరోసారి చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ వాయిదా పడుతుంది. మరోవైపు త్రివిక్రమ్‍తో సినిమా గ్యారెంటీ అనే నమ్మకంతో కొరటాల శివతో చిత్రాన్ని చరణ్ వాయిదా వేసుకోవడంతో అతను అల్లు అర్జున్‍తో మూవీ ఖాయం చేసేసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates