టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో పవన్ బిజీ అవడంతో షూటింగ్ లేటు అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని ప్రకటించినా…కొన్ని కారణాల వలన అది రిలీజ్ కాలేదు.
ఈ క్రమంలోనే ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు న్యూ ఇయర్ (1st January) గిఫ్ట్ గా ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ కు న్యూ ఈయర్ జోష్ తో పాటు ఓజీ ఫస్ట్ సింగిల్ తో డబుల్ ధమాకా ఇవ్వాలని ఓజీ మేకర్స్ భావిస్తున్నారట.
ఈ సినిమాలో ఓజాస్ గంభీర (ఓజి ) అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. పవన్ ను ఢీకొట్టే దీటైన విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఓజీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ విలక్షణ నటుడు శింబు ఓ పాట పాడారు.
ఇక ఓజీతో పాటు హరిహర వీరమలు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ లు కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates