తమ పాస్ట్ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడ్డానికి సెలబ్రెటీస్ ఎవరూ అంతగా ఇష్టపడరు. అందులోనూ పెళ్లయిన తర్వాత తమ పాత్ర లవ్ స్టోరీలను తవ్వుకోవాలని ఎవ్వరూ అనుకోరు. హీరోయిన్లు అయితే అస్సలు ఈ పని చేయరు. కానీ నయనతార రూటే వేరు. తన ప్రేమ, పెళ్లి, ఫిలిం కెరీర్ మీద రూపొందించిన నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో ఒకప్పటి తన రిలేషన్‌షిప్స్ గురించి ఆమె మాట్లాడింది. పేర్లు చెప్పలేదు కానీ.. శింబు, ప్రభుదేవాలతో వేర్వేరు సమయాల్లో రిలేషన్‌షిప్స్‌లో ఉండగా ఇబ్బంది పడ్డ విషయాన్ని చెప్పడానికి ఆమె మొహమాట పడలేదు.
తన మాజీ బాయ్‌ప్రెండ్ పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని కండిషన్ పెట్టిన విషయాన్ని ఆమె ఈ డాక్యుమెంటరీలో పంచుకుంది. అది ప్రభుదేవానే అన్న సంగతి తెలిసిందే. మరోవైపు శింబుతో కలిసి ఉండగా నయన్ ఎంత ఇబ్బందిపడిందో అందరికీ తెలుసు. ఆ రిలేషన్‌షిప్ గురించి పరోక్షంగా అక్కినేని నాగార్జున ఈ డాక్యుమెంటరీలో మాట్లాడ్డం విశేషం.
నయన్‌తో కలిసి బాస్, గ్రీకు వీరుడు సినిమాల్లో నటించిన నాగ్.. ఆమెతొ తనకున్న అనుబంధాన్ని డాక్యుమెంటరీలో గుర్తు చేసుకున్నాడు. నయన్ తొలిసారి తన సినిమా సెట్లోకి ప్రవేశించినపుడు ఆమె అందాన్ని మించి తన నడకలో రాజసం తనకు ఎంతో నచ్చిందని నాగ్ చెప్పాడు. కొన్ని రోజులు నయన్‌తో కలిసి పని చేశాక ఇలాంటి అమ్మాయితో స్నేహం చేయాలని అనిపించిందని నాగ్ తెలిపాడు. ఇక తనతో సినిమా చేస్తున్న సమయంలోనే నయన్ వేరే రిలేషన్‌షిప్‌లో ఉండేదని.. దాని వల్ల ఆమె ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించేదని నాగ్ తెలిపాడు. నయన్ ఫోన్ రింగ్ అవుతుంటే ఒక రకమైన అలజడి కనిపించేదని.. నయన్ మూడ్ మారిపోయేదని.. ఫోన్ కూడా ఆఫ్ చేసేసేదని నాగ్ గుర్తు చేసుకున్నాడు. నువ్వొక సాధికారికమైన అమ్మాయివి అయి ఉండి ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఎందుకు ఉన్నావు అని నయనతారను తాను అడిగినట్లు నాగ్ వెల్లడించాడు.
ఈ బంధం గురించి నయన్ మాట్లాడుతూ.. తన తొలి రిలేషన్‌షిప్ ప్రేమ కంటే నమ్మకం ఆధారంగా ఏర్పడిందని.. దాని గురంచి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారని.. కానీ ఇలాంటి వాటి గురించి అబ్బాయిలను ఎందుకు అడగరో తనకు అర్థం కాదని ఆమె వ్యాఖ్యానించింది.
This post was last modified on November 20, 2024 8:13 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…