ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వివాహ బంధానికి సైరా బాను ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆమె లాయర్లు మీడియాకు వెల్లడించారు. చాలాకాలంగా వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగుతోందని, అందుకే ఈ బంధం నుంచి తప్పుకోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు.
వారిద్దరి మధ్య ఏర్పడిన అగాథం తొలగిపోదని వారిద్దరూ భావిస్తున్నారని, ఆ కారణంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, తమ గోప్యతకు విలువనివ్వాలని వారు కోరుతున్నారని లాయర్లు చెప్పారు.
1995లో మార్చి 12న చెన్నైలో సైరా బానును ఏఆర్ రహమాన్ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు ఖతీజాకు రహమాన్ 2022లో వివాహం జరిపించారు. చిన్న కూతురు రహీమా, కొడుకు అమీన్ సంగీత రంగంలో ఉన్నారు.
This post was last modified on November 19, 2024 10:50 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…