Movie News

కంగువా దెబ్బ కర్ణుడికి తగిలింది

కంగువ దెబ్బ సూర్య మార్కెట్ మీద ప్రభావం చూపించేలా ఉంది. వందా రెండు వందలు కాదు రెండు వేల కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్న మాటలు చివరికి ట్రోలింగ్ కంటెంట్ గా మారిపోయాయి.

ఆఖరికి జ్యోతిక తన భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెడితే ఆ సమర్ధింపుని కూడా నెటిజెన్లు తప్పు బట్టారు. అంతగా కంగువా జనంలో నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. కనీసం యాభై శాతం బడ్జెట్ రికవరీ అయినా ఏదో అనుకోవచ్చు కానీ ఆ దిశగా సూచనలు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇప్పుడీ పరిణామం నేరుగా కర్ణ మీద పడిందని బాలీవుడ్ రిపోర్ట్.

ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా హీరో సూర్య టైటిల్ పాత్రలో సుమారు 600 కోట్లతో కర్ణ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. స్క్రిప్ట్ ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టుని ముందు టేకప్ చేసిన ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ మారిపోయిన లెక్కల ప్రకారం వర్కౌట్ కాదని భావించి వీలైనంత బడ్జెట్ ని తగ్గించమని రాకేష్ ని కోరిందట.

అయితే అలా చేస్తే క్వాలిటీ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన గురించి అలోచించే పనిలో పడ్డారని అంటున్నారు. కంగువా కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదేమో. కానీ అదేమో ప్యాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టరయ్యింది.

సో ఇప్పుడీ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదానేది కాలమే సమాధానం చెప్పాలి. కంగువా ఇచ్చిన స్ట్రోక్ కి సూర్య సైతం పునఃపరిశీలనలో పడ్డాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ జానర్ ని టచ్ చేసిన టాక్ ఉంది. కంగువా వల్ల ఇప్పుడు దీన్ని భారీ రేట్లతో మార్కెటింగ్ చేసుకోవడం కష్టం.

ఇక కర్ణ సంగతికొస్తే స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వేరెవరు ఆ పాత్రను అంతకన్నా గొప్పగా చూపించలేకపోయారు. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా మాత్రం ట్రెండ్ మారుస్తా అన్నారు. ఎప్పటికి మొదలవుతుందో చూడాలి. 

This post was last modified on November 19, 2024 2:18 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

1 hour ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago