దీపావళికి మూడు సినిమాలు పోటాపోటీగా రిలీజై అన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల లక్కీ భాస్కర్ తనకొచ్చిన పబ్లిక్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలకు తగ్గట్టు విపరీతమైన వసూళ్లు నమోదు చేయలేదు. ముఖ్యంగా అమరన్ నుంచి ఎదురైన తీవ్రమైన పోటీ, ఊహించని స్థాయికి కకు దక్కిన ఆదరణ కొంత ప్రభావం చూపించాయి. దీని గురించి రెండో రోజు నిర్మాత నాగవంశీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ లక్కీ భాస్కర్ కు లాంగ్ రన్ ఉంటుందని, ఇప్పుడు హెచ్చుతగ్గులు కనిపించినా ఫైనల్ గా గట్టిగా నిలబడుతుందని అన్నారు. ప్యాన్ ఇండియా సినిమాలే రెండు వారాలకు నెమ్మదించిన టైంలో ఇది సాధ్యమా అనుకున్నారందరూ.
కట్ చేస్తే లక్కీ భాస్కర్ మెల్లగా పుంజుకుని 111 కోట్ల గ్రాస్ దాటేసి ఇంకా స్టడీగా కొనసాగుతోంది. మొన్న వచ్చిన కంగువ, మట్కా రెండూ డిజాస్టర్ కావడం దుల్కర్ సల్మాన్ కి కలిసి వచ్చింది. అమరన్ సైతం బలంగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ ముందు లక్కీ భాస్కర్ నిలుస్తోంది. ఇది కేవలం తెలుగు వెర్షన్ కే పరిమితం కాలేదు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో సైతం కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి. వీకెండ్స్ ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. నాగవంశీ, వెంకీ అట్లూరి ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ప్రేక్షకులు నిజం చేసి చూపించారు. బ్లాక్ బస్టర్ ట్యాగ్ ఇచ్చేశారు.
నాలుగో వారంలో అడుగు పెడుతున్న టైంలో లక్కీ భాస్కర్ కు శుభ శకునాలు ఎదురయ్యాయి. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పటి నుంచనే క్లారిటీ ఇంకా లేదు కానీ త్వరలోనే ఉండొచ్చు. ఎలాగూ ఈ వారం మెకానిక్ రాకీ, జీబ్రా, దేవకీనందన వాసుదేవతో పాటు మరో నాలుగు కొత్త రిలీజులు వస్తున్న నేపథ్యంలో భాస్కర్ ఇంకో వారాంతాన్ని ఎలా వాడుకుంటాడో చూడాలి. దీని దెబ్బకు దుల్కర్ మార్కెట్ టాలీవుడ్ లో స్థిరపడిపోయింది. నిర్మాణంలో ఉన్న ఆకాశంలో ఒక తారకు ఇప్పటికే ఆఫర్స్ మొదలయ్యాయట. ఇంకో స్ట్రెయిట్ మూవీకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడట. మల్లువుడ్ కన్నా ఎక్కువ ఫోకస్ ఇక్కడే పెడుతున్నట్టులా ఉంది.
This post was last modified on November 19, 2024 2:04 pm
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…