టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో అంచనాలు పెంచుకున్న పుష్ప 2 ది రూల్ ట్రైలర్ చేస్తున్న అరాచకం అందరూ చూస్తున్నదే. ఇండస్ట్రీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ట్విట్టర్ వేదికగా దీని మీద ప్రశంసల జల్లులు కురిపిస్తూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామని అభిమానులకు జోష్ పెంచుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదని, కనీసం ఎవరూ షేర్ చేసుకోలేదని కొందరు నెటిజెన్లు చేస్తున్న కామెంట్లు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ఆల్రెడీ ఆన్ లైన్ లో మెగా వర్సెస్ అల్లు పేరుతో ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిన విషయమే. దానికే మరింత ఆజ్యం పోస్తున్నారు.
నిజానికి ఎవరైనా ఎందుకు స్పందించాలి అనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన బేసిక్ లాజిక్. పుష్ప 2 గురించి చిరంజీవితో మొదలుపెట్టి వైష్ణవ్ తేజ్ వరకు ఎవరూ మెచ్చుకోలేదని అంటున్న వాళ్లే మరి బన్నీ ఈ ఏడాదిలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మట్కా, కమిటీ కుర్రోళ్ళు, విశ్వంభర, గేమ్ ఛేంజర్ తదితర సినిమాల కంటెంట్ ని ఎక్కడా కోట్ చేయలేదు. సరే షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఒక అయిదు నిముషాలు కేటాయిస్తే అయిపోతుందిగా అనేది మెగాభిమానుల వెర్షన్. అయినా ప్రతిదానికి వివరణ ఎందుకివ్వాలనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న కౌంటర్.
ఎంత ఒకే ఫ్యామిలీ అయినా, కాకపోయినా పరస్పరం ఒకరికొకరు అవతలి వాళ్ళ సినిమాల గురించి గొప్పగా చెప్పుకోవాలన్న రూల్ ఏం లేదు. పుష్ప 2 పట్ల మెగాస్టార్ ఏం చెప్పకపోయినా, విశ్వంభర గురించి బన్నీ పట్టించుకోకపోయినా అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఈ మధ్యే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ అందరు హీరోల గురించి తన మనసులో మాటలు బయట పెట్టాడు. మేమంతా ఒకటేనని అల్లు అరవింద్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వలేదు కాబట్టి తర్వాతైనా ఆయన వైపు నుంచి ఏదో రోజు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ఈ ఫ్యాన్ వార్ గోల ఎక్స్ లో కనిపిస్తూనే ఉంటుంది.
This post was last modified on November 19, 2024 1:43 pm
దీపావళికి మూడు సినిమాలు పోటాపోటీగా రిలీజై అన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల లక్కీ భాస్కర్ తనకొచ్చిన పబ్లిక్ రెస్పాన్స్,…
రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన తలపతి 69 షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది.…
కంగువ దెబ్బ సూర్య మార్కెట్ మీద ప్రభావం చూపించేలా ఉంది. వందా రెండు వందలు కాదు రెండు వేల కోట్లు…
ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ దర్శకుల్లో.. హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ ఒకడు. తన…
ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ…
ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.…