Movie News

సందీప్ వంగ చూసిన కొత్త మహేష్

ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ దర్శకుల్లో.. హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ ఒకడు. తన సినిమాలో ఎవరు హీరో అయినా.. కేవలం సందీప్ మీదే వందల కోట్ల బిజినెస్ జరిగే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా తీసింది రెండు కథలు, మూడు సినిమాలే అయినా.. సందీప్‌కు ఉన్న క్రేజే వేరు. అతడితో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

సందీప్ సినిమాలే కాదు.. తన ఇంటర్వ్యూలు, ఏదైనా వేదికల్లో అతను మాట్లాడే మాటలు కూడా అమితాసక్తి రేకెత్తిస్తుంటాయి. స్టార్ హీరోల గురించి అతను మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు. తాజాగా అతను మహేష్ బాబు గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇండియాలోని స్టార్ హీరోలలో మహేష్ బాబు చాలా స్పెషల్ అని సందీప్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.

తాను మహేష్‌తో ఒక యాడ్ ఫిలిం చేశానని.. దాంతో పాటుగా నాలుగైదుసార్లు అతణ్ని బయట కలిశానని సందీప్ వెల్లడించాడు. మనం సినిమాల్లో చూసేదాంతో పోలిస్తే మహేష్ చాలా భిన్నమని.. సినిమాల్లో మనం చూసేది మహేష్‌లో 25 శాతం మాత్రమే అని.. మిగతా 75 శాతాన్ని ఎవ్వరికీ కనిపించదని.. అది ఒక స్టార్‌లో ఉన్న స్సెషల్ క్వాలిటీ అని సందీప్ అన్నాడు. ప్రేక్షకులుగా మనం మహేష్‌ను ఎప్పట్నంచో చూస్తున్నామని.. దర్శకుడయ్యాక తాను మహేష్‌ను దగ్గరగా చూశానని.. అతను షూ లేస్ కట్టుకునే తీరు… షర్ట్ సరి చేసుకునే తీరు.. జుట్టు లాక్కోవడం.. ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందని.. బయట మహేష్‌లో ఉండే ఎనర్జీని మనం స్క్రీన్ మీద చూడలేదని సందీప్ అన్నాడు.

ఇలా మహేష్ ఎంత స్పెషల్ అనే విషయాన్ని తనదైన శైలిలో కొత్తగా చెప్పాడు సందీప్. వీరి కలయికలో సినిమా వస్తుందని గతంలో ప్రచారం జరిగింది కానీ.. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాతో బిజీ అయిపోతుండగా, సందీప్ ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ సినిమాలు తీయాల్సి ఉంది.

This post was last modified on November 19, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ కు ఈ టూర్ వెరీ వెరీ స్పెషల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…

5 minutes ago

కత్తిపోట్లతో సైఫ్ కి 15 వేల కోట్ల నష్టమా…?

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…

11 minutes ago

దేవీ ఆన్ డ్యూటీ… సందేహాలు అక్కర్లేదు

పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎదురుకున్న ఇబ్బందులు, వేరొకరితో నేపధ్య సంగీతం…

37 minutes ago

ట్రంప్‌కు ఫ‌స్ట్ ప‌రాభ‌వం.. ఆ నిర్ణ‌యం ర‌ద్దు!

అమెరికా 47వ అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణ‌యం.. నాలుగు రోజులు కూడా తిర‌గ‌క ముందే బుట్ట‌దాఖ‌లైంది. ఇది…

59 minutes ago

సుబ్బారాయుడు ఫస్ట్ పంచ్ అదిరిపోయిందిగా!!

ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు…

2 hours ago

పీఆర్ ఓకే…ఇక ‘ఫారెస్ట్’లోకి పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు ఏదో…

2 hours ago