పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న బజ్ ట్రైలర్ ద్వారా మరింత పెరిగింది. ఇక పుష్ప మొదటి భాగం క్రియేట్ చేసిన సెన్సేషన్ దృష్ట్యా, రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎలాగూ రేట్లు గట్టిగానే ఉంటాయి. ఇక బెన్ ఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు, ఎక్స్ ట్రా షోలు అనేవి బోనస్. ఇక ఆంధ్రప్రదేశ్ లో పుష్ప 2కి ఎలాంటి వెసులుబాటు ఉంటుందనేది అసలు ప్రశ్న. కూటమి ప్రభుత్వం పెద్ద సినిమాలకు ఇదివరకే మంచి రేట్లను, ఆడిగినన్ని షోలు ఇస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ కూడా లభించింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను 300 రూపాయల వరకూ పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
గతంలో వైసీపీ పాలనలో పుష్ప 1 టికెట్ ధరల విషయంలో సరైన మద్దతు లభించకపోవడంతో నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా సర్కార్ అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కల్కి – దేవర సినిమాలకు మంచి రేట్లే ఇచ్చారు. అయితే, ఆ చిత్రాలకు మరీ 300 రూపాయలు కాకుండా గరిష్ఠంగా 250 రూపాయల వరకు మాత్రమే టికెట్ ధరలను అనుమతించారు. ఇక దేవరకు ఇవ్వలేని ఆ ఆఫర్ ను ఇప్పుడు పుష్ప 2కి ఇస్తారా అనే ప్రశ్న సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇది సాధ్యమైతే, వారాంతపు కలెక్షన్లలో సూపర్ హిట్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెరగడం కొత్త విషయం కాదు. కానీ 300 రూపాయల రేటు వంటి ప్రతిపాదనలు అరుదుగా వస్తాయి. పుష్ప 2ని ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే చూడాలనే ఉత్సాహంతో ఉన్నందున, ఈ పెంపు నిర్ణయానికి భారీ స్పందన వచ్చే అవకాశముంది. అయితే, ఈ ధరల వల్ల వీకెండ్ తర్వాత కలెక్షన్లపై ప్రభావం పడుతుందా లేదా అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి, పుష్ప 2పై ఉన్న క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఈ వ్యూహం ఎలా పని చేస్తుందో చూడాలి.
This post was last modified on November 19, 2024 2:45 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……