మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్‌ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది. కొంతమంది నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు కానీ.. ఎక్కువమంది ట్రైలర్ అదుర్స్ అనే అంటున్నారు. సినిమా మీద ఇప్పటికే ఉన్న హైప్‌ను ట్రైలర్ ఇంకా పెంచిందన్నది వాస్తవం.
ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ‘పుష్ప-2’ ట్రైలర్ చూసి ఊగిపోతున్నారు. అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు కూడా ‘పుష్ప-2’ గురించి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘పుష్ప-2’ వసూళ్ల మీద కూడా అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు ‘పుష్ప-2’ తొలి రోజు వసూళ్ల గురించి ప్రెడిక్షన్స్ చెబుతూ.. పోల్స్ పెడుతున్నారు. అంతే కాక దీనిపై బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
‘పుష్ప-2’ హిందీ వెర్షన్ మాత్రమే మినిమం 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అంటున్నారు. కానీ ఇది కనీస వసూళ్లు మాత్రమే అని.. అన్నీ కలిసి వస్తే రూ.75-80 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ‘జవాన్’ సినిమా రూ.65 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ‘పుష్ప-2’ ఆ రికార్డును బద్దలు కొట్టడానికి మెరుగైన అవకాశాలున్నాయి.
అసలు డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘పుష్ప: ది రైజ్’ అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోవడానికి నార్త్ ఇండియాలో పెద్ద హిట్టవడమే ప్రధాన కారణం. ఇప్పుడు అక్కడ ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. ‘బాహుబలి-2’ తర్వాత ఆ స్థాయిలో హైప్ ఈ చిత్రానికే ఉంది. అప్పటితో పోలిస్తే థియేటర్ల సంఖ్య, టికెట్ల ధరలు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు కూడా బాగా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వసూళ్ల మీద ట్రేడ్ పండిట్స్ అంచనాలు చెబుతూ. పోల్స్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా పుష్ప-2 కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయనే దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
This post was last modified on November 18, 2024 9:04 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…