Movie News

సమంతను మ్యాచ్ చేయగలదా అన్నారు.. కానీ

‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను కొంచెం గ్లామరస్‌గా చూశాం కానీ.. ఆ స్థాయిలో అందాలు ఆరబోస్తూ సెక్సీ స్టెప్స్ వేయడం ముందెన్నడూ జరగలేదు. సమంత నెవర్ బిఫోర్ అప్పీయరెన్స్, బన్నీతో కలిసి వేసిన స్టెప్పులు ఆ పాటకు ఎంతో ఆకర్షణ తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ కూడా భలేగా ట్యూన్ చేయడంతో ‘ఊ అంటావా ఊహూ అంటావా’ పాట పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే బెస్ట్ ఐటెం సాంగ్స్‌లో ఒకటిగా ‘ఊ అంటావా..’ నిలిచిపోయింది.

సుకుమార్ సినిమాలంటే ఐటెం సాంగ్ మాండేటరీ కాబట్టి ‘పుష్ప-2’లోనూ ఆ తరహా పాట ఉంటుందని తెలుసు. ఐతే ఆ పాటలో ఎవరు నర్తిస్తారనే విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. చివరికి శ్రీలీల ఖరారైంది. కానీ ఈ పేరు బయటికి వచ్చినపుడు సోషల్ మీడియాలో ఒకింత అసంతృప్తి వ్యక్తమైంది.

‘పుష్ప’లో సమంత మాదిరి శ్రీలీల మ్యాజిక్ చేయగలదా అన్న సందేహాలు కలిగాయి. సమంతలో ఉన్న సెక్సప్పీల్ శ్రీలీలలో లేదని.. ఇంకా చిన్న పిల్లలాగే కనిపించే శ్రీలీల ఇలాంటి పాటకు న్యాయం చేయలేదనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ మొన్న రిలీజ్ చేసిన పోస్టర్, లేటెస్ట్‌గా లాంచ్ అయిన ట్రైలర్లో శ్రీలీల లుక్స్, హొయలు చూశాక ఆమెను తక్కువగా అంచనా వేశారనిపిస్తోంది.

ట్రైలర్‌లో రెప్పపాటులో మెరిసి మాయమైనప్పటికీ శ్రీలీల పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. స్లో మోషన్లో తన షాట్‌ను చూపిస్తూ ఆమెకు ఎలివేషన్ ఇస్తున్నారు నెటిజన్లు. ఆ చిన్న షాట్లో శ్రీలీల హొయలు పోయిన, మెలికలు తిరిగిన తీరు చూసి షాకవుతున్నారు. ఆ చిన్న షాట్‌లోనే కావాల్సినంత సెక్సప్పీల్ చూపించింది శ్రీలీల. సమంత స్థాయి స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవచ్చు కానీ.. డ్యాన్స్‌లో ఎవ్వరినైనా డామినేట్ చేయగలదు శ్రీలీల. బన్నీ లాంటి గ్రేట్ డ్యాన్సర్‌తో కలిసి ఆమె మోత మోగించేయడం ఖాయమని.. మంచి ట్యూన్ తోడైతే ఈ పాటకు ఆకాశమే హద్దు అని ఇప్పుడు నెటిజన్లు ఎలివేషన్ల ఇస్తున్నారు.

This post was last modified on November 18, 2024 8:54 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

3 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

6 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

6 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

6 hours ago