మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక త్వరలోనే మరికొన్ని రోజుల్లో ఏదో ఒక అప్డేట్ రావచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి మరొక పనిలో బిజీ కావడంతో ఇప్పట్లో మహేష్ తో ప్రాజెక్టులో బిజి అయ్యే అవకాశం లేదని అనిపిస్తోంది.
ఇక మహేష్ బాబు మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపించగా ఇప్పుడు మొత్తం లుక్ మార్చేసి కొత్తగా దర్శనమిచ్చాడు. కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. మురళి మోహన్ మనవరాలు రాగ మాగంటితో సింహా ఏడాడుగులు వేయనున్నారు. ఆదివారం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది.
ఇక వివాహం డిసెంబర్ 14 యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో గ్రాండ్‌గా జరగనుంది. అక్కడే వారం రోజుల పాటు సంగీత్ అని వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఆ తరువాత ఇండియాకు వచ్చి రాగానే రిసెప్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇటు మురళీమోహన్, అటు రాజమౌళి తరఫున సినీ ప్రముఖులు రాజకీయ నాయకులను పిలవాల్సి ఉంటుంది. కాబట్టి రాజమౌళి ఈ హడావుడి లో మహేష్ ప్రాజెక్టుపై ఆలోచించే అవకాశం తక్కువ. అన్ని కార్యక్రమాలు ఫినిష్ అయ్యాకే తీరిగ్గా వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం సినిమా పనులు మళ్ళీ షురూ చేసే అవకాశం ఉంది. ఇక రాజమౌళి తీసుకున్న బ్రేక్ కారణంగా మహేష్ మరికొంత కాలం మౌనంగా ఎదురుచూడక తప్పదు.
This post was last modified on November 18, 2024 4:35 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…