రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన లేఖ ఎంత దుమారం రేపిందో అందరూ చూశారు. ఇంకా అటు వైపు నుంచి స్పందన రానప్పటికీ ఇదంతా నెట్ ఫ్లిక్స్ ఆమె మీద తీసిన ‘బియాండ్ ది ఫెయిరీ టైల్’ డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసమని అన్న వాళ్ళు లేకపోలేదు. నానుమ్ రౌడీ తాన్ కంటెంట్ కు సంబంధించి రేగిన వివాదం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇంత హడావిడి జరగడానికి కారణమైన సదరు 1 గంట 22 నిమిషాల చిరు కం లఘు చిత్రం నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంతగా ఇందులో ఏముందో చూద్దాం.
ఇది నయనతార కెరీర్ ప్రారంభం నుంచి విఘ్నేష్ శివన్ తో వివాహం దాకా జరిగిన సంఘటనల సమాహారంగా తీశారు. ఇండస్ట్రీలోకి రావడం, ఇక్కడి బంధాలు, అభిమానించినట్టు నటించి మోసం చేసే వ్యక్తులు, అవమానాలు, ఒడిదుడుకులను కొన్ని సంఘటనల ద్వారా పరిశ్రమ హీరోలు, ప్రముఖులతో చెప్పించారు. బాలకృష్ణ శ్రీరామరాజ్యంలో సీతగా తనను ఎంచుకున్నప్పుడు జరిగిన ట్రోలింగ్ ని ప్రస్తావించారు. అయితే అప్పట్లో ఇలాంటి కాంట్రావర్సిలకు కారణమైన పేర్లను మాత్రం బయటపెట్టకుండా టీమ్ జాగ్రత్త తీసుకుంది. విగ్నేష్ తో లవ్ స్టోరీ నుంచి మ్యారేజ్ దాకా కొన్ని విజువల్స్ ని పొందుపరిచారు.
మొత్తంగా చెప్పాలంటే బియాండ్ ది ఫెయిరీ టైల్ మరీ ప్రత్యేకంగా ఏమి లేదు. మహానటి తరహాలో డ్రామాకు స్కోప్ లేదు కనక ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడూ చూడని కనని వినని సంగతులేమీ లేవు. మ్యారేజ్ సిడిని కోట్లకు అమ్ముకుందనే కామెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా లాంటి డాక్యుమెంటరీ మీద సినీ ప్రేమికులు కాసింత ఆసక్తిగానే ఉన్నారు. కానీ సెన్సేషన్, ఎమోషన్ తో కట్టిపడేయడం లాంటివి ఆశించకుండా ఉంటేనే ఓ మోస్తరుగా టైం పాస్ చేయిస్తుంది. లేదంటే కష్టం. ఆ మధ్య వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి ఎపిసోడ్ తరహాలో ఇది అంతకన్నా యావరేజ్ భావన కలిగిస్తుంది తప్ప ఏ అద్భుతమూ లేదు.
This post was last modified on November 18, 2024 3:28 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……