‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యకరంగా బీహార్‌లోని పాట్నాను వేదికగా ఎంచుకుని షాకిచ్చింది టీం. అక్కడ కూడా చిన్న స్థాయి ఈవెంటే ఉంటుందనుకున్నారు. కానీ మన దగ్గర బహిరంగ మైదానాల్లో జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్, ఆడియో వేడుకల్ని తలదన్నేలా భారీ స్థాయిలో జరిగిన ఈవెంట్ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది.
సౌత్ స్టార్ హీరోల సినమాలకు వారి రాష్ట్రాల్లో పెద్ద ఈవెంట్లు చేయడం, అభిమానులు భారీ ఎత్తున తరలి రావడం విశేషమేమీ కాదు. కానీ పాట్నా లాంటి చోట ఓ తెలుగు హీరో సినిమా ఈవెంట్‌కు ఇలా జనం తండోపతండాలుగా రావడం, భారీ మైదానం జనంతో కిక్కిరిసిపోవడం అనూహ్యం. మధ్యాహ్నం తర్వాత మొదలైన జనసందోహం సాయంత్రానికి అదుపు చేయలేని స్థాయికి చేరుకుంది.
900 మంది పోలీసులు, 300 మందికి పైగా ప్రైవేటు సెక్యూరిటీని పెట్టి మరీ ఈ ఈవెంట్‌ను నిర్వహించడం గమనార్హం. ఈ స్థాయితో భద్రత కల్పించినా ‘పుష్ప-2’ ఈవెంట్‌కు పరిమితికి మించి జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో జనం పోలీసుల మీదికి చెప్పులు, రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు మరింతగా లాఠీలను ఝుళిపించారు. స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగింది. ఐతే అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం తలెత్తలేదు.
అల్లు అర్జున్ వేదిక మీదికి వచ్చే సమయానికి అతణ్ని చూసేందుకు వేదిక మధ్యలో ఉన్న టవర్ మీదికి వందల మంది ఎక్కేసి నిలడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ‘పుష్ప-2’ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందనడంలో సందేహం లేదు. ఇదేదో పొలిటికల్ ఈవెంట్ అనుకునే స్థాయిలో దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
This post was last modified on November 18, 2024 2:20 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…