వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని చీవాట్లు పెట్టింది. చట్టాలకు అతీతంగా వ్యవహరించి.. ఇప్పుడు చట్టా ల ద్వారా రక్షణ కోరడం ఇటీవల కాలంలో అలవాటుగా మారిందని దుయ్యబట్టింది. చట్టం పరిధిలో వ్యవ హరించాల్సిన బాధ్యత సమాజ స్థితిగతులు తెలిసిన దర్శకుడిగా మీకు తెలియదా? అని నిలదీసింది. ఓ కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న వర్మ పిటిషన్‌పై కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.
ఏంటా కేసు?
ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు చేశా రంటూ.. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వ్యూహం సినిమా చిత్రీకరణ సమయంలో చంద్రబాబు, పవన్‌లను కించపరిచేలా ఆయన పోస్టర్లను ప్రిపేర్ చేశారన్నది ఈ కేసు సారాంశం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం.. ఇటీవల ఆయన కోసం ముంబై వెళ్లి.. అక్కడే ఆయనకు 41ఏ కింద నోటీసులు కూడా ఇవ్వడం తెలిసిందే.
అయితే.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ.. వర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంఅందరికీ సమానమేనని వ్యాఖ్యానించింది. దర్శకుడు అయినంత మాత్రాన చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపింది.
అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అయితే.. మంగళవారం జరిగే పోలీసు విచారణకు హాజరు కావాలని వర్మను ఆదేశించింది.
This post was last modified on November 18, 2024 1:43 pm
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…