దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే అతను సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే నంబర్ వన్ సంగీత దర్శకుడు అని ఒప్పుకోవాల్సిందే. బహు భాషల్లో క్రేజీ ప్రాజెక్టులతో మామూలు బిజీగా లేడు తమన్.
తెలుగు, తమిళం, హిందీలో అతను భారీ సినిమాలకు పని చేస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న శంకర్-రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్‌కు అతనే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా తన లిస్టులో ఉంది.
తెలుగులో ఇంకా ప్రభాస్ మూవీ రాజా సాబ్, పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ, బాలయ్య చిత్రం అఖండ-2… ఇలా క్రేజీ మూవీస్‌కు పని చేస్తున్నాడు. గేమ్ చేంజర్‌తో పాటుగా సంక్రాంతికి రాబోతున్న బాలయ్య చిత్రం డాకు మహారాజ్‌కు కూడా అతనే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే.
మరోవైపు క్రిస్మస్ బరిలో ఉన్న బాలీవుడ్ మూవీ బేబీ జాన్‌కు కూడా తమనే సంగీతం సమకూరుస్తున్నాడు. అంతే కాక తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని హిందీ డెబ్యూ మూవీ జాట్ కూడా తమన్ ఖాతాలోనే ఉంది. ఇలాంటి భారీ చిత్రాలే కాక తెలుసు కదా, శబ్దం లాంటి మిడ్ రేంజ్ మూవీస్‌కు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవన్నీ కాక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మెగా మూవీకి కూడా తనే సంగీత దర్శకుడినని తాజాగా తమన్ వెల్లడించాడు. క్వాంటిటీ పరంగా చూసినా, సినిమా రేంజ్ పరంగా చూసినా ప్రస్తుతం ఇండియాలో ఇంత బిజీగా ఉన్న సంగీత దర్శకుడు మరొకరు కనిపించరు. అనిరుధ్ అయినా, దేవిశ్రీ ప్రసాద్ అయినా తన వెనుక నిలవాల్సిందే. సోషల్ మీడియాలో ఊరికే తమన్‌ను ట్రోల్ చేస్తుంటారు కానీ.. తన రేంజ్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.
This post was last modified on November 18, 2024 1:31 pm
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…