పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది. నిజానికి నార్త్ లో ఉన్న ఒక బయట రాష్ట్రంలో వేడుక చేసింది ముందు రామ్ చరణే అయినా పరిమిత సీటింగ్ ఉన్న ఇన్ డోర్ థియేటర్ లో చేయడంతో భారీ రీచ్ అనిపించుకోలేకపోయింది. ఉన్నంతలో ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ ప్రకారమే నిర్వహించినప్పటికీ ఇప్పుడు పుష్ప 2కి ఏదైతే హంగామా, డిస్కషన్ చూస్తున్నామో అది గేమ్ ఛేంజర్ విషయంలో కనిపించలేదన్నది వాస్తవం. నెక్స్ట్ లిస్టులో ఉన్న వేదికలకు సంబంధించిన ఏర్పాట్లను పునఃసమీక్షించుకోవాలి.
బడ్జెట్ పరంగా చూసుకుంటే పుష్ప 2, గేమ్ ఛేంజర్ రెండూ వందల కోట్ల బడ్జెట్ తో రూపొందినవే. కానీ చరణ్ మూవీకి జరిగిన విపరీతమైన జాప్యం దాని బజ్ ని తగ్గించేసింది. పైగా దర్శకుడు శంకర్ మీద ఇండియన్ 2 ప్రభావం అంతో ఇంతో ఉంది. సో హైప్ తేవాల్సిన బాధ్యత మొత్తం రామ్ చరణ్ మీదే పడింది. టీజర్ కొంతవరకు ఆ పని చేసింది. విడుదల చేసిన రెండు పాటల్లో ఒకటి ఛార్ట్ బస్టర్ కాగా మరొకటి సోసోగా వెళ్ళింది. ఈ నెల 20న మరో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. మెలోడీ డ్యూయెట్ ఇది. తమన్ దీని గురించి ఇప్పటికే పలుమార్లు తెగ ఊరించాడు కనక అంచనాలు పెట్టేసుకోవచ్చు.
ఒక విషయం మర్చిపోకూడదు. ఇంకో రెండు మూడు వారాల పాటు సోషల్ మీడియా, ఆన్ లైన్ ఎక్కడ చూసినా అధిక శాతం పుష్ప 2 గురించిన చర్చే ఉంటుంది. ప్రమోషన్లు ఆ రేంజ్ లో డిజైన్ చేసుకున్నారు. బెనిఫిట్ షో టికెట్లు ఎలా అమ్మాలనే దాని మీద కూడా వెరైటీ స్ట్రాటజీలు అనుకుంటున్నారట. సో కొన్ని రోజులు గేమ్ ఛేంజర్ బ్రేక్ తీసుకోవడం బెటరనేది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న వెర్షన్. డిసెంబర్ 5 తర్వాత పుష్ప 2 టాక్ వచ్చి ఎంత పెద్ద హిట్టయినా ఆ వేడి వారం పది రోజులు ఉంటుంది. ఈలోగా గేమ్ ఛేంజర్ పబ్లిసిటీ ఊపందుకోవచ్చు. జనవరి 10 కూడా ఎంతో దూరంలో లేదు మరి.
This post was last modified on November 18, 2024 3:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…