అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్ మీడియాను ముంచెత్తేసింది. దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది ‘పుష్ప-2’ ట్రైలర్. ఇందులో చాలా హైలైట్లు ఉన్నా.. చివర్లో వచ్చిన ‘వైల్డ్ ఫైర్’ డైలాగ్ బాగా పేలింది.
‘పుష్ప’ పార్ట్-1 రిలీజైనపుడు ‘పుష్ప అంటే ఫ్లవరనుకున్నావా.. ఫైర్’ అనే డైలాగ్‌తో ఊపేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు తాను జస్ట్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ తన చుట్టూ ఉన్న వాళ్లతో చెప్పించిన పంచ్ డైలాగ్ బాగా హైలైట్ అయింది. ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరూ ‘వైల్డ్ ఫైర్’ అనే మాటతోనే ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం అదే బాటలో పయనించాడు. ‘పుష్ప-2’ ట్రైలర్ మీద ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
“పట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతా విస్తరిస్తోంది. డిసెంబరు 5న పేలబోతోంది. పుష్ప పార్టీ కోసం ఆగలేకపోతున్నా” అంటూ జక్కన్న ఈ ఉదయం ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. రాజమౌళి అన్ని సినిమాలకూ ఏమీ స్పందించడు. తనకు కావాల్సిన వాళ్ల సినిమాల గురించి, లేదా తనకు బాగా నచ్చిన సినిమాల గురించే ఇలా పోస్టులు పెడతాడు. ‘పుష్ప-2’ ట్రైలర్ మీద ఒక సగటు అభిమానిలా పోస్టు పెట్టడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
సుకుమార్ మీద రాజమౌళికి ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్‌తో కలిసి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. అంతే కాక ఓ సందర్భంగా సుకుమార్, త్రివిక్రమ్ మాస్ లీగ్‌లోకి రాలేదు కానీ.. వస్తే తనకు మించి మాస్ డైరెక్టర్లు అవుతారని పేర్కొన్నాడు. అలాగే ‘జగడం’ సినిమాలో ఓ సన్నివేశంలో మాస్ గురించి మరో ఇంటర్వ్యూలో ఒక రేంజిోల ఎలివేషన్ ఇచ్చాడు.
This post was last modified on November 18, 2024 12:43 pm
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…
ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఆయన రాబందులతో పోల్చారు. రాబందుల…