ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడనిపిస్తోంది. ట్రైలర్‌లో సస్పెన్స్, యాక్షన్ తారాస్థాయిలో ఉండటమే కాకుండా, కొత్త పాత్రల పరిచయంతో ఆసక్తి రేపుతోంది. అందులో ముఖ్యంగా అరగుండు గెటప్‌తో కనిపించిన తారక్ పొన్నప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించిన తారక్ పొన్నప్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెడలో చెప్పుల దండ, ఇంటెన్స్ లుక్‌తో తారక్ పాత్ర సినిమాకు కొత్త మలుపు ఇవ్వబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తారక్, దేవరలో (భైరా కొడుకు) తన నెగిటివ్ రోల్ ద్వారా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఇక పుష్ప 2 ట్రైలర్ ద్వారా ఈ పాత్రకు సుకుమార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇకపోతే తారక్ పొన్నప్ప ఆ పాత్రపై ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారింది. పుష్ప 2లో తన పాత్ర పాజిటివ్, అలాగే నెగిటివ్ షేడ్స్ కలిగినదిగా ఉంటుందని, అల్లు అర్జున్ పాత్రకు కీలక మలుపు తెచ్చే పాత్రగా ఉంటుందని వెల్లడించడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఆయన లుక్, మాటలే కాదు, నటన కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని ట్రైలర్ చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు పాత్రలతో పాటు తారక్ పొన్నప్ప పాత్ర కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రంలో వైవిధ్యమైన క్యారెక్టర్లను పరిచయం చేస్తూ, ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. సుకుమార్ వినూత్నమైన కథనం, అల్లు అర్జున్ పవర్‌పుల్ ప్రదర్శన, కొత్త విలన్ లుక్స్ సినిమాపై భారీ హైప్ తీసుకువచ్చాయి. మరి విడుదల అనంతరం సినిమా అంచనాల స్థాయిని అందుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on November 18, 2024 10:11 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…