ప్రభాస్-అనుష్కల బంధం గురించి ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తెరపై వీళ్లిద్దరూ కలిసి నటించిన బాహుబలి, మిర్చి సినిమాల ఫలితాల గురించి.. అందులో వాళ్ల కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బయట కూడా చాలా క్లోజ్‌గా ఉండే ఈ ఇద్దరూ ప్రేమికులని, పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి అయిపోయి ఉంటే ఈ ఊహాగానాలు ఆగిపోయేవేమో గానీ.. ప్రభాస్‌కు 40 ఏళ్లొచ్చినా, అనుష్కకు 38 ఏళ్లు పూర్తయినా ఇప్పటిదాకా పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐతే ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించినపుడు మాత్రం ఏమీ లేదని కొట్టిపారేస్తారు. సమాధానం దాటవేస్తారు.
తాజాగా అనుష్క.. ప్రభాస్‌తో పెళ్లి గురించి పరోక్షంగా స్పందించాల్సిన అవసరం పడింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. తన కొత్త చిత్రం నిశ్శబ్దం విడుదల నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్ చేసి అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా మిర్చి సినిమా చిత్రీకరణ సందర్భంగా ప్రభాస్, అనుష్క పెళ్లి బట్టల్లో తయారై పీటలపై కూర్చున్న ఫొటో ఒకటి షేర్ చేస్తూ ఓ అభిమాని దీని గురించి ఏమంటారు అని అనుష్కను ప్రశ్నించాడు. ఐతే ఆ అభిమాని అడిగిన కోణంలో జవాబు ఇవ్వకుండా.. ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఇద్దరం మాట్లాడుకుంటుంటే తీసిన క్యాండిడ్ పిక్ అని.. ఇది తన మనసుకు దగ్గరైన చిత్రమని.. యువి క్రియేషన్స్ వాళ్ల తొలి చిత్రం అని పేర్కొని.. యువి అధినేతలైన వంశీ, ప్రమోద్, విక్కీల పేర్లు ప్రస్తావించి దండం పెట్టే ఎమోజీలు పెట్టింది ఈ జవాబు చూశాక అనుష్క మరోసారి ప్రభాస్‌తో బంధం గురించి ఏమీ మాట్లాడకుండా అనుష్క తెలివిగా తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
This post was last modified on October 4, 2020 11:12 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…