టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా ‘తమన్’ పేరు చెప్పేయొచ్చు. కెరీర్ ఆరంభం నుంచి పెద్ద పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్నా సరే.. అతడి మీద తరచుగా విమర్శలు వస్తూనే ఉంటాయి.
ఎక్కడెక్కడి నుంచో ట్యూన్స్ కాపీ కొట్టి పాటలు రూపొందిస్తుంటాడని..అలాగే తన ట్యూన్లను తనే రిపీట్ చేస్తుంటాడని అతడి మీద ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి. తమన్ నుంచి ఏదైనా పాట రిలీజైతే.. ముందు అదెక్కడి నుంచి కాపీ కొట్టాడా అనే శోధనలు మొదలవుతుంటాయి.
ఏదైనా పాటతో పోలిక కనిపిస్తే చాలు.. మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతారు. తమన్‌ను ఒక ఆట ఆడేసుకుంటారు. తమన్ కూడా ఇలాంటి వాటికి అలవాటు పడిపోయాడు.
తాజాగా తమన్ మరోసారి సోషల్ మీడియాకు దొరికిపోయాడు. తాజాగా అతను సంగీతం అందించిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘డాకు మహారాజ్’ టీజర్ లాంచ్ అయింది. ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ టీజర్ చివర్లో వచ్చిన మ్యూజిక్ బిట్ దగ్గర తమన్ దొరికిపోయాడు.
మణిశర్మ సంగీతం అందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో దుంప దెంచేసావే పాట ఆరంభంలో వచ్చే మ్యూజిక్, ‘డాకు మహరాజ్’ టీజర్ చివర్లో వినిపించిన సౌండ్‌లో సారూప్యత కనిపిస్తోంది. ఇది పట్టుకుని ఎప్పట్లాగే ‘కింగ్’ సినిమాలో బ్రహ్మి-నాగ్ ట్రాక్‌తో మీమ్స్ చేసి తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది చూసి ఇలా ఎన్నిసార్లు దొరికిపోతావ్ తమన్.. ఇలాంటి విమర్శలు రాకుండా కొత్తగా మ్యూజిక్ చేయలేవా అంటూ అతణ్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on November 16, 2024 9:54 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించిన పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కడా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార…
+ ``పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!`` + ``మీ సెలవులు రద్దు చేస్తున్నాం.…
ఇండియా క్రేజీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది. ఆగస్ట్ 14…
దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’…
అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా…