ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ విడుదల ఏప్రిల్ 10 అయినప్పటికీ అభిమానుల ఎదురుచూపులు ఒక్కో పోస్టర్ వచ్చేకొద్దీ పెరుగుతూ పోతోంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని హారర్ కామెడీ గ్రాండియర్ ఆవిష్కరించబోతున్నామని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఊరించడంతో ఒక్కసారిగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. బాలీవుడ్ లో హారర్ ట్రెండ్ విపరీతంగా ఉంది. ముంజ్యా, స్త్రీ 2, భూల్ భులయ్యా 3 ఇలా వరసగా వందల కోట్లు కొల్లగొట్టేశాయి. స్టార్ల లేనివే ఇంత చేస్తే ఇక ప్రభాస్ ఉంటే అరాచకమేగా.
ఇక అసలు విషయానికి వస్తే ది రాజా సాబ్ లో ఒక సూపర్ హిట్ హిందీ పాటను రీ మిక్స్ చేస్తారనే టాక్ బలంగా ఉంది. దానికి ఊతమిచ్చేలా తమన్ చిన్న హింట్ ఇచ్చాడు. సినిమా పేరు తను చెప్పలేదు కానీ అంతర్గత వర్గాల ప్రకారం ఆది హవా హవా ఏ హవా అనే ఛార్ట్ బస్టర్ సాంగ్. కో ఇన్సిడెన్స్ అనే పదం ఎందుకు వాడామో చూద్దాం. 1994లో ఇన్సాఫ్ అప్నే లహూ సే వచ్చింది. శత్రుఘ్న సిన్హా, సంజయ్ దత్ హీరోలుగా నటించారు. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాదు కానీ లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్వరపరిచిన పాటలు అదిరిపోతాయి. ముఖ్యంగా పాకిస్థాన్ గాయకుడు హసీన్ జహంగీర్ పాడిన హవా హవా.
అందులో నటించిన సంజయ్ దత్ ఇప్పుడీ రాజా సాబ్ లో ఉండటం కాకతాళీయమే అయినా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషమే. అక్కడ హీరోగా ఇప్పుడు ప్రభాస్ తాతగా చాలా ముఖ్యమైన పాత్ర దక్కించుకున్నాడు. నెగటివ్ టచ్ కూడా ఉంటుందట. అధికారికంగా పాట గురించి ఇంకా ప్రకటన రాలేదు కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఇది మంచి కిక్ ఇచ్చే న్యూస్. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్న రాజా సాబ్ అటు ప్రభాస్ ఫౌజీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చాక కొనసాగుతుంది. తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వింటేజ్ ప్రభాస్ లుక్స్ ఇందులో ఉండబోతున్నాయి.
This post was last modified on November 16, 2024 9:39 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…