అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ సరసన నటించిన షాజన్ పదంసికి ఇప్పుడు పెళ్లి కుదిరింది. ఎప్పుడో 2010లో నటించిన అమ్మాయికి ఇప్పటిదాకా మ్యారేజ్ కాలేదా అంటే తారల జీవితాల్లో కొన్ని ఆలస్యంగా జరుగుతాయి అంతే. తెలుగులో ఈ అమ్మడు నటించినవి రెండు సినిమాలే. వెంకటేష్ రామ్ కలిసి నటించిన మసాలాలో చేసింది కానీ డెబ్యూతో పాటు ఇదీ డిజాస్టర్ కావడంతో తర్వాత అవకాశాలు రాలేదు.
షాజన్ తెరంగేట్రం రన్బీర్ కపూర్ సరసన రాకెట్ సింగ్ లాంటి సూపర్ హిట్ మూవీతో జరిగింది. ఇంతకీ షాజన్ పదంసిని కట్టుకున్నది ఎవరయ్యా అంటే అతని పేరు ఆశిష్ కనాకియా. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ మూవీ మ్యాక్స్ సిఈఓ ఇతను. బిజినెస్ సర్కిల్స్ లో పెద్ద పేరుంది. గత కొంత కాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. తానుగా ఈ అమ్మాయి ప్రకటించడంతోనే ఈ విషయం అధికారికంగా బయటికి వచ్చింది. ఆరంజ్ లో చేసింది చిన్న పాత్రే అయినా మంచి పాటలు, గుర్తుండిపోయే సీన్ల వల్ల అప్పట్లో షాజన్ కు పేరు వచ్చింది.
కానీ దాని ఫలితం కెరీర్ మీద ప్రభావం చూపించింది. హిందీలో హౌస్ ఫుల్ 2, దిల్ తో బచ్చా హై జీ లాంటి సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆశిష్, షాజన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నా అఫీషియల్ గా పెళ్ళితోనే శుభవార్తను పంచుకోవాలని ఇంతకాలం ఆగారు. తెరంగేట్రం జరిగిన పదిహేను సంవత్సరాల తర్వాత పెళ్లి జరగడంలో మరీ ఆశ్చర్యం లేదు కానీ అసలు కనిపించకుండా పోయిన హీరోయిన్ ఇలా హఠాత్తుగా ఇదిగో నా భర్త అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం మూవీ లవర్స్ కి స్వీట్ షాకే.
This post was last modified on November 16, 2024 4:32 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…