టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్ డౌన్ పంతొమ్మిది రోజులకు చేరుకుంది. రేపు పాట్నాలో జరగబోయే భారీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బాలీవుడ్ వర్గాలకు సైతం దిమ్మదిరిగి పోయేలా చేస్తుందని అక్కడి ఏర్పాట్లు ప్రత్యక్షంగా చూస్తున్న అభిమానుల కామెంట్స్ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. పబ్లిసిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా కార్పొరేట్ సంస్థలతో ఏర్పర్చుకున్న టై అప్ ద్వారా మైత్రి అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుత ఫలితాలు ఇచ్చేలా ఉంది. గతంలో ఏ సినిమాకు ఇలా జరగలేదనే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఓవర్సీస్ థియేటర్లో కూల్ డ్రింక్, పాప్ కార్న్ టబ్బుతో మొదలుపెట్టి స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో దొరికే బియ్యం సంచుల దాకా ప్రతిదాని మీద పుష్ప 2 బొమ్మ కనిపిస్తోంది. అవుట్ డోర్ హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. లోకల్, మెట్రో ట్రైన్లను ఆకర్షణీయమైన స్టిక్కర్లతో అలంకరిస్తున్నారు. బీహార్ లో ఉన్న బన్నీ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి పుష్ప 2 ప్రీమియర్ షోలకు తుపాకులతో వెళ్తామని, బయట బుల్లెట్లు గాల్లో పేల్చాక లోపలకు అడుగు పెడతామని చెప్పడం చూస్తే మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేరళలో వారం కిందకే బెనిఫిట్ షో టికెట్లు అమ్మడం మొదలుపెట్టారు.
రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం విశేషాలు వినాల్సి వస్తుందో ఫ్యాన్స్ ముందే ప్రిపేర్ కావడం మంచిది. ఇప్పటికీ షూటింగ్ లోనే బిజీగా ఉన్న దర్శకుడు సుకుమార్ ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ తమన్ పూర్తి చేసేశాడు. సెకండ్ హాఫ్ మీద అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ పని చేస్తున్నారని సమాచారం. ఇంకో వారంలోపే విదేశాలకు డ్రైవ్స్ డిస్పాచ్ చేయాలి. ఏరియాల వారీగా మతిపోయే రేట్లకు ఎగ్జిబిటర్లు హక్కులు కొంటున్నారు. ప్రతి సెంటర్ అన్ని స్క్రీన్లలో అర్ధరాత్రి ఒంటి గంట షోలు పడటం దాదాపు ఖరారే. ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఎవరి ఊహకు అందడం లేదు.
This post was last modified on November 16, 2024 9:44 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…