Movie News

ధనుష్ మీద భగ్గుమన్న నయనతార

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో విడుదల చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. పదేళ్ల క్రితం విజయ్ సేతుపతి, నయన్ జంటగా నానుమ్ రౌడీ తాన్ రిలీజయ్యింది. తెలుగులో నేనూ రౌడీనేగా డబ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ పెద్ద హిట్టు. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన పాటలు ఆడియో పరంగా ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ సినిమాకు నిర్మాత ధనుష్. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తే మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇది గతం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. 

ఎల్లుండి నెట్ ఫ్లిక్స్ లో నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ కానుంది. ఇందులో ఆవిడ కెరీర్ కు సంబంధించిన ఎన్నో విశేషాలు, ఇంటర్వ్యూలు, వ్యక్తిగత జీవితం ఇలా చాలా అంశాలు పొందుపరిచారు. సహజంగానే తన సినిమాల క్లిప్పులు, ఆడియోలు పొందుపరిచారు. అయితే ఇంతకు ముందు వచ్చిన టీజర్ లో నానుమ్ రౌడీ తాన్ కు సంబంధించిన మూడు సెకండ్ల కంటెంట్ వాడుకోవడం ధనుష్ టీమ్ గమనించి ఆ మేరకు కాపీ రైట్ ఉల్లంఘన కింద పది కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసు పంపించింది. నయన్ వైపు నుంచి సమస్యని పలు విధాలుగా పరిష్కరించాలని చూసినా కాకపోవడంతో వాటిని ఎడిట్ చేసి తీసేశారు. 

ఇప్పుడు చూడబోయే సిరీస్ లో నానుమ్ రౌడీ దాన్ కు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్ ఉండదు. ఇదే నయన్ ఉగ్రరూపానికి కారణం అయ్యింది. ఒక పేరున్న కుటుంబం, తండ్రి అన్నయ్య మద్దతుతో ఎదిగిన ఒక నటుడిగా ఉన్న మీరు ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన నా లాంటి నటికి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని మొదలుపెడుతూ మొత్తం ఉదంతాన్ని లెటర్ ద్వారా నయనతార వివరించింది. తమ సినిమా, తనపై, భాగస్వామిపై ఏర్పర్చుకున్న ద్వేషాన్ని అందులో ఎండగట్టింది. నిరభ్యంతర పత్రం (ఎన్ఓసి) కోసం రెండు సంవత్సరాలు ప్రయత్నించి విఫలం కావడం గురించి ధనుష్ ని నిలదీసింది. 

ఇప్పటికీ నానుమ్ రౌడీ తాన్ పాటలు ఇప్పటికీ భావోద్వేగాలను పాలిస్తాయని, ఇప్పుడవే తన హృదయాన్ని ముక్కలు చేశాయని బాధను వ్యక్తం చేసింది. లీగల్ నోటీసు ద్వారా గెలవొచ్చేమో కానీ ధనుష్ ద్వంద వైఖరి బయట పడిందని పేర్కొంది. 2016లో ఫిలిం ఫేర్ అవార్డు వచ్చాక నా గెలుపును తట్టుకోలేక ధనుష్ ఈగోని బయట పెట్టిన వైనాన్ని ఫిలిం సర్కిల్స్ లో విన్నానని నయనతార పేర్కొనడం గమనార్హం. ఇదంతా నాణేనికి ఒక వైపు లాగా ఆమె వైపు కన్విన్సింగ్ గా ఉంది. మరి ఇమేజ్ కి భంగం కలిగించేలా ఉన్న ఈ లేఖపై ధనుష్ ఎలా స్పందిస్తాడో, తన వెర్షన్ ని ఎలా వినిపిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

This post was last modified on November 16, 2024 1:06 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

2 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

3 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

5 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

6 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

6 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

9 hours ago