అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ ప్రమోషన్లు సరైన రీతిలో మొదలుపెడితే రికార్డుల ఊచకోతలో ఇదేమీ తక్కువ కాబోదని యూనిట్ వర్గాల కథనం. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ హిస్టారికల్ డ్రామా అధిక భాగానికి క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలింది జ్యోతి కృష్ణ చూసుకుంటున్నారు. మార్చి 28 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పక్కా ప్రణాళికతో పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిర్మాత ఏఎం రత్నం పబ్లిసిటీ పరంగా కొత్త స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారట.
ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు పార్ట్ 1లో ఏడు ఎపిసోడ్లు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగతనం చేసే సన్నివేశం చాలా బాగా వచ్చిందట. కుస్తీ ఫైట్, అడవిలో తోడేలుని వేటాడే సీన్, సముద్రం నుంచి వచ్చి పోర్ట్ లో చేసే యుద్ధం, గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్సులతో పాటు ఛార్మినార్ సెట్ ముందు చిత్రీకరించిన ఘట్టం అసలైన హైలైట్ గా చెబుతున్నారు. ఇవి కాకుండా ఐటెం సాంగ్ సైతం మళ్ళీ మళ్ళీ చెప్పుకునే స్థాయిలో ఉందట. వీటికి సరైన విఎఫెక్స్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ కనక కుదిరితే థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరే స్థాయిలో ఉంటుందని సమాచారం.
సో ఈ లెక్కన హరిహర వీరమల్లుని తక్కువంచనా వేయడానికి లేదు. బడ్జెట్ పరంగా ఇప్పటికీ విపరీతంగా ఖర్చు పెట్టేసిన ఏఎం రత్నం ఫైనల్ అవుట్ ఫుట్ మీద చాలా ధీమాగా ఉన్నారు. కేవలం తెలుగు వెర్షనే కాకుండా ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబుగా కనిపించనున్నాడు. ఆస్కార్ విజేత కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయ్యాక రిలీజవుతున్న మొదటి సినిమా.
This post was last modified on November 16, 2024 10:37 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…