పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా ఉంది. దానికి తమన్ స్వయంగా పూనుకుంటున్నాడు. ఇటీవలే మీడియాతో జరిపిన ముచ్చట్లలో ఈ సంగతి పంచుకున్నాడు. అకీరా చేతి వేళ్ళు చాలా పెద్దగా ఉంటాయని, పియానో అద్భుతంగా ప్లే చేస్తాడని, రెండు నెలలు తనతో కలిసి పని చేసిన అనుభవంతో ఓజి కోసం అకీరాను పిలిపించుకుంటానని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. యానిమల్ విడుదలైనప్పుడు అందులో పాపా మేరీ జాన్ ట్యూన్ కి అకీరా ప్లే చేస్తున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
అప్పుడే అకీరానందన్ మ్యూజిక్ టేస్ట్ ఫ్యాన్స్ కు అర్థమయ్యింది. అయితే తనేమి దీనికే పరిమితమవుతాడని టెన్షన్ పడనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ పవన్ కు నటనతో పాటు పలు విభాగాల్లో శిక్షణ మొదలైంది. ఎప్పుడు పరిచయం చేస్తారనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ ముందు కెమెరాకు తగ్గట్టు సిద్ధం చేస్తున్నారు. వైజాగ్ సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని టాక్. పవన్ టాలీవుడ్ కు రాకముందు నట ఓనమాలు నేర్పించింది ఆయనే. అందుకే అంత నమ్మకంతో కొడుకుని అక్కడికి పంపించారట. మార్షల్ ఆర్ట్స్, డాన్స్ తదితరాల శిక్షణ కోసం వేరే నిపుణులను చూస్తున్నారు.
ఈ లెక్కన అకీరా ఇంకో రెండు మూడేళ్ళలో డెబ్యూ చేయడం ఖాయమే. తండ్రిలాగే సాంకేతిక విభాగాల్లో ఆసక్తి ఉండటం హీరోగా తనకు మంచి చేసేదే. ఓజిలోనే అకీరా మీద ఒక ఎపిసోడ్ ఉంటుందని, చాలా షాకింగ్ గా దర్శకుడు సుజిత్ దాన్ని షూట్ చేశాడనే ప్రచారం నాలుగైదు రోజులుగా తిరుగుతోంది కానీ స్పందించడానికి టీమ్ వర్గాలు అందుబాటులో లేవు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే పెద్ద కిక్కు. ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నవి అయ్యాక యాక్టింగ్ మానేసినా ఆ లోగా అకీరానందన్ అందుబాటులోకి వచ్చేస్తాడు కాబట్టి ఫ్యాన్స్ కి లోటు ఉండదు.
This post was last modified on November 16, 2024 10:38 am
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…