టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, రీచ్ సంపాదించి.. తర్వాతి తరం హీరోలకు దాన్ని వారసత్వంగా అందించారు.
అభిమానులు కూడా తర్వాతి తరం హీరోల మీద అమితమైన ప్రేమను చూపిస్తూ వారి సినిమాలను ఆదరిస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ మెగా సపోర్ట్‌తో గొప్ప స్థాయికి ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిస్తే.. బన్నీ మెగా బలానికి తోడు సొంతంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుని తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు.
సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లకు సైతం కెరీర్ ఆరంభంలో మంచి సపోర్టే లభించింది. ఐతే ఈ ముగ్గురూ పడి లేస్తూ ముందుకు సాగుతున్నారు. వీరిలో వరుణ్‌ది మొదట్నుంచి భిన్నమైన ప్రయాణం. అతను చాలామంది వారసుల్లా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించలేదు. పెద్ద మాస్ హీరో కావడానికి తగ్గ కటౌట్ ఉన్నా.. క్లాస్ టచ్ ఉన్న భిన్నమైన సినిమాలే చేస్తూ ముందుకు సాగాడు.
ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో వరుణ్ కెరీర్ మంచి స్థితిలోనే కనిపించింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు డిజాస్టర్లు కావడం వరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ మీద తీవ్ర ప్రభావమే చూపాయి.
ఐతే ‘మట్కా’తో అతను పుంజుకుంటాడని అంతా అనుకున్నారు. వరుణ్ కూడా ఇదే ధీమాతో ఉన్నాడు. ఈసారి సరైన సినిమాతో వస్తున్నానని.. అభిమానులు నిరాశపడరని చెప్పాడు. తీరా చూస్తే ‘మట్కా’ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. గురువారం రిలీజైన సినిమాకు పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. ప్రి రిలీజ్ బజ్ లేకపోవడం వల్ల ‘మట్కా’కు బుకింగ్స్ సరిగా జరగలేదు. తొలి రోజు వాకిన్స్ అయినా బాగుంటాయేమో అనుకుంటే అదీ లేదు.
హిందీలో కూడా రిలీజైన ఈ సినిమాకు డే-1 మొత్తంగా కలిపి కోటి రూపాయలు మాత్రమే షేర్ వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే ఒకప్పుడు వరుణ్‌కు అండగా ఉన్న మెగా ఫ్యాన్స్ సైతం అతణ్ని పక్కన పెట్టేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వరుస ఫ్లాపులతో వాళ్లు కూడా వరుణ్ మీద నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది. వాళ్లు సపోర్ట్ చేసి ఉంటే ఓపెనింగ్స్ మరీ ఇంత దారుణంగా ఉండేవి కావు. మరి మళ్లీ మెగా ఫ్యాన్స్ నమ్మకం సంపాదించడానికి వరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.
This post was last modified on November 15, 2024 4:22 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…