సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్. భారీ కాన్వాస్ పెట్టుకున్నా దానికి మద్దతుగా ఉండాల్సిన కథా కథనాలు బలంగా లేకపోవడం వల్ల బ్లాక్ బస్టర్ సూచనలు తగ్గిపోతున్నాయి. నిన్నటికి ఇవాళ్టికి ఓపెనింగ్స్ లో వచ్చిన తేడానే దానికి సాక్ష్యం.
అయితే నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం ఇదంతా ఒకటి రెండు రోజులకు పరిమితమని మెల్లగా తమ సినిమా అంచనాలకు మించి ఆడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మొదటి రోజు స్పందనతో పాటు నెగటివ్ ఫీడ్ బ్యాక్ కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.
వాటిలో ప్రధానంగా రెండు విషయాలున్నాయి. మొదటిది కంగువా 2. రెండో భాగం చాలా ఘనంగా, క్రూరంగా, మరింత పెద్ద స్కేల్ తో తీయడం ఖాయమని నొక్కి చెప్పారు. కాకపోతే దీనికన్నా ముందు దర్శకుడు శివ అజిత్ తో ఒక సినిమా చేసి వచ్చి తర్వాత సీక్వెల్ పనులు మొదలుపెడతారట.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ గురించి స్పందిస్తూ ఇందులో దేవిశ్రీ ప్రసాద్ తప్పేమి లేదని, సౌండ్ మిక్సింగ్ లో జరిగిన పొరపాట్ల వల్ల లౌడ్ నెస్ ఎక్కువయ్యింది తప్ప, సెకండ్ షో నుంచి రెండు పాయింట్ల వాల్యూమ్ తగ్గించేలా డిస్ట్రిబ్యూటర్లకు సూచనలు చేశామని అన్నారు.
మొదటి ఇరవై నిమిషాల ఫ్రాన్సిస్ ఎపిసోడ్ కు మాత్రమే నెగటివ్ గా టాక్ వచ్చిందని, మిగిలిన సినిమాకు టికెట్లు కొన్న ప్రేక్షకుల నుంచి మద్దతు దక్కిందని చెప్పారు. సూర్య అన్ని సినిమాల లైఫ్ రన్ కలెక్షన్లను కంగువా కేవలం రెండు మూడు రోజుల్లో దాటేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పెద్ద చిత్రాలకు మిక్స్ టాక్ రావడం సహజమేనని తర్వాత అవి నిలదొక్కుకుంటాయని చెప్పడం కొసమెరుపు. వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ సౌండ్ తగ్గిస్తేనో లేదా ఇంకోటి చేస్తేనో కంగువ అమాంతం పికప్ కావడం అనుమానమే కానీ మరింత వైల్డ్ గా కంగువా 2 ఉంటుందని చెప్పడమే అసలు హైలైట్. కాకపోతే దగ్గరలో మాత్రం కాదు.
This post was last modified on November 15, 2024 3:53 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…