సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం మీద. నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లంటూ హైప్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే అతను చెప్పినదాంట్లో నాలుగోవంతు కూడా వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వెయ్యేళ్ల కిందటి నేపథ్యం తీసుకుని కొన్ని తెగల మధ్య పోరాటం అంటూ దర్శకుడు శివ భిన్నమైన కథనే ఎంచుకున్నాడు కానీ.. దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. సినిమా అంతా గజిబిజి గందరగోళం తప్ప ఎమోషన్ పండలేదు. అసలు ఈ కథతో ఏం చెప్పదలుచుకున్నారన్నదే ప్రేక్షకులకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
‘కంగువ’ విషయంలో ఎక్కువమంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే.. ఇదో పెద్ద శబ్ద కాలుష్యం సినిమా అని. సినిమా అంతా ప్రతి పాత్రా విపరీతంగా అరుస్తూ ఉంటుంది. మామూలుగా సటిల్‌గా యాక్ట్ చేసే సూర్య సైతం సినిమాలో విపరీతంగా అరుస్తూ కనిపించాడు. పాత్రల అరుపులు చాలవన్నట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ సహా అన్ని సౌండ్లూ అతిగా అనిపించాయి.
దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కూడా జనాలు విమర్శిస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఒక పోస్ట్ మీద ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పొకుట్టి స్పందించాడు.
సినిమాల్లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అయితే అందరూ సౌండ్ ఇంజినీర్‌ను నిందిస్తున్నారని.. కానీ చివరి నిమిషంలో ఫిలిం మేకర్స్ అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కవరప్ వల్ల ఇది జరుగుతోందని.. ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా సినిమాలో తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లౌడ్ మ్యూజిక్‌తో కవరప్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా రసూల్ మాట్లాడారు. దీనిపై ‘కంగువ’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on November 15, 2024 3:57 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…