కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని, అంత కంటెంట్ ఉందని ధీమాగా చెప్పారు. అంతే కాదు కంగువ 1కు ఎవరైనా పోటీ వచ్చినా సినిమా చూశాక సీక్వెల్ తో కాంపిటీషన్ వచ్చేందుకు ఎవరూ సిద్ధపడ్డారని సవాల్ చేయడం చూసి సూర్య ఫ్యాన్స్ చాలా ఊహించుకున్నారు.
విపరీతంగా కస్టపడటం సూర్యకు కొత్త కాదు. గజినీ, సెవెంత్ సెన్స్ లాంటి ఎన్నో చిత్రాలకు ఒళ్ళు హూనం చేసుకున్నాడు. కానీ కంగువ అంతకన్నా స్పెషల్. ఎందుకంటే శ్రమతో పాటు ఈసారి బోలెడు సమయాన్ని పెట్టుబడి పెట్టాడు.
కానీ కంగువ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ అద్భుతాలు చేసే విధంగా లేదనే రీతిలో టాక్స్ వినిపిస్తున్నాయి, రివ్యూస్ కనిపిస్తున్నాయి. బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటే దర్శకుడు శివ కనీసం పావువంతు అందుకోలేకపోయాడనే కామెంట్లు బలంగా ఉన్నాయి. అయిదు దీవులతో ఒక అటవీ ప్రపంచాన్ని సృష్టించడం గొప్ప ఆలోచన. దానికో చైల్డ్ సెంటిమెంట్ ముడిపెట్టి సూర్యని డ్యూయల్ రోల్ లో ఆవిష్కరించడం అంతకన్నా ఎగ్జైటింగ్ పాయింట్. కానీ పేపర్ మీద గొప్పగా అనిపించే ప్లాట్ తీరా తెరమీదకు వచ్చే సరికి తేడా కొట్టేసింది. గ్రాండియర్ కు లోటు లేకపోయినా కథనం కావాల్సినంత చేటు చేసింది.
తుది ఫలితం తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ తమిళంలో ఎలా ఆడినా తెలుగులో మాత్రం కంగువకు ఎదురీత తప్పేలా లేదు. పొన్నియిన్ సెల్వన్ ఒరిజినల్ వెర్షన్ అద్భుతాలు చేసినా తెలుగులో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. కానీ కంగువ ఆ మాత్రం అందుకున్నా గొప్పే అనుకోవాలి.
తమిళనాడులో అమరన్ థియేటర్ షేరింగ్ వల్ల కంగువ ఓపెనింగ్స్ ప్రభావితం చెందాయి. రికార్డులు బద్దలు కాలేదు కానీ మంచి నెంబర్లు వచ్చాయి. కానీ వీకెండ్ లో అన్ని భాషల్లో ఎంత బలంగా నిలబడుతుందనేది కీలకం కానుంది. దీనికి సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడతారని చెన్నై టాక్.
This post was last modified on November 15, 2024 12:16 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…