సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త ఏముంటుంది? టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్.. గతంలో ఒక వైన్ షాపుకి వెళ్లి మందు కొంటున్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. అందులో ఒక మామూలు కుర్రాడిలా బనియన్ వేసుకుని వెళ్లి మందు బాటిల్ కొనుక్కుని వచ్చాడు. ఇది జరిగింది గోవాలో. అప్పట్లో వైరల్ అయిన ఈ వీడియో గురించి నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే ‘అన్‌స్టాపబుల్’ షోలో బన్నీ ఓపెన్ అయ్యాడు.
ఈ వీడియోను ప్రదర్శించి దీని సంగతేంటి.. ఎవరి కోసం మందు కొన్నావు అంటూ బన్నీని బాలయ్య అడిగాడు. దీనికి బన్నీ బదులిస్తూ.. అప్పుడు మందు బాటిల్ కొన్నది తన కోసం కాదన్నాడు. తాను ఒక స్పెషల్ పర్సన్ కోసం అది కొన్నానంటూ తన పేరు సందీప్ అని వెల్లడించాడు. అతడిది విజయవాడ అని చెప్పాడు. అతడికి బాలయ్య అంటే పిచ్చి అభిమానమని.. నందమూరి వీరాభిమాని అని.. అతడి ఒంటి మీద కోస్తే పసుపు రక్తం వస్తుందని బన్నీ వ్యాఖ్యానించడం విశేషం.
ఇక ఈ ఎపిసోడ్లో బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలు వేశాడు. ప్రభాస్, మహేష్ బాబు వీళ్లలో ఎవరు నీకు పోటీగా భావిస్తున్నావు అని బన్నీని అడిగితే.. ‘పుష్ప’ సినిమాలోని ‘‘నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు. అది కూడా నేనే’’ అంటూ సాగే పాట లిరిక్స్ పాడి తాను ఎవరినీ పోటీగా భావించనని.. తనకు తానే పోటీ అని చెప్పకనే చెప్పాడు అల్లు అర్జున్. ఇక తాను సాధించిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గురించి మాట్లాడుతూ.. దాన్ని తెలుగు హీరోలందరికీ అంకితం చేస్తున్నట్లు బన్నీ చెప్పాడు. గతంలో ఏ తెలుగు నటుడికీ నేషనల్ అవార్డు రాలేదని తెలిసి చాలా ఫీలయ్యానని.. దీంతో అది సాధించి తీరాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ కలను నెరవేర్చుకున్నట్లు బన్నీ చెప్పాడు.
This post was last modified on November 15, 2024 11:33 am
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…