టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని మార్చారనే వార్త ఎంత సంచలనం రేపిందో చూశాం.
తమన్, మరో ఇద్దరు బీజీఎమ్ కోసం పని చేస్తున్నారనే టాక్ కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. దానికి ఇవాళ కొంత సమాధానం దొరికింది. బాలకృష్ణ డాకు మహారాజ్ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన తమన్ పుష్ప 2కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులో తాను ఒక భాగమేనని, మిగిలిన సంగీత దర్శకులు కూడా పని చేస్తున్నారని కుండబద్దలు కొట్టేశాడు.
అంటే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ఉన్నట్టు క్లారిటీ వచ్చినట్టే. కాకపోతే అఫీషియల్ అయ్యేదాకా ఖరారుగా చెప్పలేం. తాను ఎడిటింగ్, రీ రికార్డింగ్ లో సినిమా చూశానని, చాలా అద్భుతంగా వచ్చిందని, అంచనాలకు మించి మెప్పించడం ఖాయమనే రీతిలో తమన్ అన్న మాటలు అల్లు అర్జున్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అయితే వేదిక, సందర్భం వేరు కాబట్టి పుష్ప 2 గురించి ఇంతకన్నా ఎక్కువ తమన్ చెప్పలేకపోయాడు. తన భాగం వరకు పని పూర్తయ్యిందనే సంకేతం ఇచ్చాడు. చివరి దశ ప్యాచ్ వర్క్ షూటింగ్ లో ఉన్న పుష్ప 2 మరో డ్యూయెట్ ని ఈ వారంలో పూర్తి చేసుకోబోతోంది.
ఇంకో ఇరవై రోజుల్లో పుష్ప 2 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న తరుణంలో టీమ్ మీద చాలా ఒత్తిడి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనుకాడకుండా పోస్ట్ ప్రొడక్షన్ చేయిస్తున్నారు. సెన్సార్, ఓవర్ సీస్ డ్రైవ్స్ లాంటి కీలకమైన పనులు పెండింగ్ ఉన్నాయి. ఎల్లుండి జరగపోయే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ మీద అందరి కళ్లున్నాయి. రెండున్నర నిమిషాల వీడియోలో పుష్పరాజ్ అరాచకం సాంపిల్ చూస్తారని, ఇది వచ్చాక హైప్ ఎక్కడికి వెళ్తుందో ఊహించడం కష్టమని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో శ్రీలీల, బన్నీల మీద షూట్ చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ విడుదల చేయబోతున్నారు.
This post was last modified on November 15, 2024 12:01 pm
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…