ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు టాప్ హీరోల గురించి ఈ షోలో మాట్లాడాడు. కొన్నాళ్లుగా పవన్ అభిమానులకు, బన్నీకి మధ్య అగాథం నెలకొన్న నేపథ్యంలో పవన్ గురించి మాట్లాడిన మాటలు అమితాసక్తిని రేకెత్తించాయి.
పవన్ ఫొటోను ప్రదర్శిస్తూ ఆయన గురించి మాట్లాడమని బాలయ్య అడగ్గా.. ‘‘కళ్యాణ్ బాబు.. ఆయన ధైర్యం అంటే నాకు చాాలా ఇష్టం. నేను సమాజంలో చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటాను. అందరినీ దగ్గరగా గమనిస్తుంటాను. కానీ నేను కళ్యాణ్ గారిని కూడా దగ్గర్నుంచి చూస్తూ వస్తున్నాను. ఆయన చాలా ధైర్యమైన నాయకుడు. ఆయనలోని ఆ లక్షణమే నాకు చాలా ఇష్టం’’ అని బన్నీ చెప్పాడు.
ఇక మహేష్ బాబు ప్రస్తావన రాగా.. ‘‘మహేష్ బాబు గారు అంటే అందరూ ఆయన అందం గురించి మాట్లాడుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఇచ్చింది. కానీ నాకు వ్యక్తిగతంగా ఆయనలో నచ్చేది ఏంటంటే.. తన కమ్ బ్యాక్స్ చాలా బాగుంటాయి. ఆయన ఫెయిల్యూర్ తర్వాత కమ్ బ్యాక్ చాలా బాగుంటుంది. ఇక మహేష్ గారు ట్రూ సినిమా లవర్ లాగా అనిపిస్తారు. తన సినిమాలు, తాను చేసిన పాత్రల ద్వారా తెలుగు సినిమా ప్రమాణాలను ఆయన పెంచారు. అది కూడా నాకు మహేష్ గారిలో చాలా ఇష్టమైన విషయం’’ అన్నాడు.
మరోవైపు ప్రభాస్ గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాది ఒకటే మాట ఆరడుగుల బంగారం’’ అన్నాడు. ప్రభాస్, నువ్వు మంచి ఫ్రెండ్స్ కదా అని అడిగితే.. అవును, ఆయనంటే నాకు చాలా ఇష్టం అని బన్నీ చెప్పాడు. తాను ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీ స్వయంగా డెకరేట్ చేస్తానని.. ఈ విషయం తెలుసుకుని యూరప్ నుంచి ఒక పెద్ద బాక్స్ క్రిస్మస్ డెకరేషన్ ఐటెమ్స్ పంపించాడని.. అలాగే ప్రభాస్‌కు చెట్లు అంటే ఇష్టమని తెలిసి తాను ఆయన ఫామ్ హౌస్ కోసం పెద్ద మొక్క తీసుకెళ్లి ఇచ్చానని బన్నీ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on November 15, 2024 1:34 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…