Movie News

మెగా హీరో మళ్ళీ ట్రాక్ తప్పాడు

పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పలుచోట్ల తిరిగి మరీ ప్రమోషన్ చేసుకున్న మట్కాకి బలహీనమైన ఓపెనింగ్ వచ్చింది. పట్టుమని కోటి షేర్ రాకపోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది.

మెగా ఫ్యామిలీ ఫాన్స్ సగం చూసినా మంచి నెంబర్లు కనిపించేవి. కానీ వాళ్ళలోనూ దీని పట్ల ఆసక్తి కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమే. టాక్ సంగతి పక్కనపెడితే కనీసం ప్రధాన కేంద్రాల్లో మార్నింగ్ షోలైనా హౌస్ ఫుల్ బోర్డులు పడాలి. కానీ ఎక్కడా అవి నమోదైన దాఖలాలు లేవు.

ఇక పబ్లిక్ టాక్, రివ్యూలు మట్కాకు ప్రతికూలంగా ఉన్నాయి. దర్శకుడు కరుణ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు ఆయనే చేతల్లో చూపించలేకపోయారని థియేటర్ నుంచి బయటికి వచ్చేలోపే అర్థమయ్యింది.

మట్కా డాన్ గా పిలవబడే రతన్ ఖత్రీ జీవితాన్ని కమర్షియలైజ్ చేయబోయి ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో ఇంత పెద్ద బడ్జెట్ ని వృధా చేసుకున్న వైనం స్క్రీన్ మీద కనిపించింది. అవసరం లేని పాటలు, ఆసక్తి కలిగించని మలుపులు, ఆర్టిస్టుల ఎంపిక, హై అనిపించే ఎపిసోడ్స్ లేకపోవడం, రొటీన్ ట్రీట్మెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్న రీతిలో బోలెడున్నాయి.

కంగువ పోటీ వల్ల ఇలా జరిగిందని సమర్ధించుకోవడానికి లేదు. ఎందుకంటే దానికీ ఫ్లాప్ టాకే తిరుగుతోంది. కాకపోతే సూర్య ఇమేజ్, ప్రమోషన్ల వల్ల క్రేజ్ వచ్చి నిన్న థియేటర్లలో జనం కనిపించారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు.

మట్కానే మరీ అన్యాయంగా తయారయ్యింది. దీనికన్నా రెండు వారాల క్రితం రిలీజైన లక్కీ భాస్కర్, అమరన్, కలకు మెరుగైన వసూళ్లు కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మొత్తానికి వరుణ్ తేజ్ ట్రాక్ తప్పేశాడు. త్వరలోనే దర్శకుడు మేర్లపాక గాంధీతో జట్టు కట్టబోతున్నాడు. మరి ఇతనైనా మెగా హీరోకు కోరుకున్న బ్రేక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశ.

This post was last modified on November 15, 2024 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…

27 minutes ago

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

2 hours ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

3 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

3 hours ago

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని…

3 hours ago