ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గత కొంత కాలంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీ మధ్య ఆన్ లైన్ వార్ జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన స్పష్టత వీటిలో ఏమైనా వస్తుందేమోనని సగటు ప్రేక్షకులు సైతం వెయిట్ చేశారు.
అయితే ఫస్ట్ పార్ట్ అన్నారు కాబట్టి కీలకమైన సంగతులు కొన్ని సీక్వెల్ లో చూడాలన్న మాట. ఇప్పుడొచ్చిన మొదటి భాగంలో ఇద్దరూ భలే భలే కబుర్లు పంచుకున్నారు. కూల్ గా, ఆహ్లాదకరంగా జరిగిన ముఖాముఖీలో డ్యూయల్ ఫైర్ అనిపించారు.
ఇప్పటి జనరేషన్ హీరోల్లో బన్నీకి ఎవరంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – చిరంజీవి – ప్రభాస్ తదితరుల మీద ఉన్న అభిప్రాయాలు, సోషల్ మీడియాలో వైరలైన ఒకప్పటి వైన్ షాప్ వీడియో, తన ప్రాణ స్నేహితుడు బాలయ్య ఫ్యాన్ కావడం లాంటివన్నీ ఇందులో ప్రత్యేకంగా చూపించారు.
తనకు ఈ జెనరేషన్ హీరోలతో ఉన్న పోటీ గురించి కూడా బన్నీ తెలివైన సమాధానం చెప్పాడు. జాతీయ అవార్డుని టాలీవుడ్ హీరోలకు అంకితం ఇవ్వడం ఆకట్టుకునేలా ఉంది. బాలయ్య స్టైల్ లో సరదా ఆటలు, విచిత్ర ప్రశ్నలు అన్నీ ఇందులో పొందుపరిచారు. ఎంటర్ టైన్మెంట్ ఇచ్చారు.
అవన్నీ ఇక్కడ చెప్పుకోవడం భావ్యం కాదు కానీ పార్ట్ 1లోనే ఇన్ని ఉంటే మరో పార్ట్ 2లో ఇంకేం దాచారో వేచి చూడాలి. బహుశా రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలు దాంట్లో చోటు చేసుకుని ఉండొచ్చు. తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించిన ముచ్చట్ల కోసం వెయిట్ చేయాలి.
గత సీజన్లోనే బాలయ్య, బన్నీ ఒక ఎపిసోడ్ చేశారు. అయితే పుష్ప 2 ది రూల్ విడుదల దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కలుసుకున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హుషారుగా షోని లాగించగా బన్నీ తనదైన మ్యానరిజమ్ తో రక్తి కట్టించాడు. సోషల్ మీడియా రెస్పాన్స్ చూస్తే సూపర్ హిట్టే అనిపిస్తోంది.
This post was last modified on November 15, 2024 10:39 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…