నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పుష్ప 2 ది రూల్ బిజిఎం బాధ్యతలు తన స్థానంలో తమన్ తో పాటు మరో ఇద్దరికీ ఇచ్చారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి దేవి ఫ్యాన్స్ చూపులన్నీ కంగువ మీదే ఉన్నాయి.
కానీ థియేటర్ లో చూశాక లౌడ్ సౌండ్, హోరెత్తిపోయే వాయిద్యాలతో నానా ఖంగాళీ జరిగిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు శివ తీసిన కథ అలా ఉంది కదాని కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ బలహీనమైన సీన్లను సైతం నేపధ్య సంగీతంతో నిలబెట్టిన ఉదంతాలు దేవి నుంచి అనిరుధ్ దాకా ఎన్నో చూశాం కదా.
పైగా కంగువ పాటలకు సైతం యునానిమస్ గా ఛార్ట్ బస్టర్ రెస్పాన్స్ రాకపోవడం మరో మైనస్. క్యాచీగా లేవు. మళ్ళీ మళ్ళీ వినేలా వైరల్ కాలేదు. రీల్స్ చేసుకునేవాళ్ళకు అంతగా ఎక్కలేదు. ఈ మైనస్సులకు తోడు ఇప్పుడీ ఫీడ్ బ్యాక్. నిజానికి దేవికి తగినంత సమయమే దొరికింది. కంగువ పలుమార్లు వాయిదా పడింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కూడా నెల రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఒకవేళ ఏదైనా కరెక్షన్లు చేయాలనుకుంటే ఇది మంచి సమయమే. కానీ అదే నెలలో హైదరాబాద్ లైవ్ కన్సర్ట్ లో దేవి చాలా బిజీగా ఉన్నాడు. అందుకే హడావిడిగా కంగువ పనులు పూర్తి చేశాడేమో తెలియదు.
ఏది ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకోవాలి. మరీ బ్యాడ్ అని అన్నా అనకపోయినా మ్యూజిక్ లవర్స్ ని సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. ఒకవేళ పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ అయినా దాని క్రెడిట్ దేవికి కేవలం పాటలకు మాత్రమే పరిమితమవుతుంది. బీజీఎమ్ పేరు వేరొకరికి వెళ్ళిపోతుంది.
అదిరిపోయే ఆల్బమ్ తో దేవి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదంతా మింగుడుపడటం లేదు. కంగువ కనక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే బహుశా ఇంతగా ఈ టాపిక్ మీద ఫోకస్ ఉండేది కాదేమో కానీ ఊగిసలాట ఫలితం వల్ల కామెంట్స్ తప్పలేదు.
This post was last modified on November 15, 2024 10:26 am
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…